అరే బాబు, GST గురించి తెలియక పోతే తెలుసుకోవాలి కానీ, మీ అర్ధ జ్ఞానం తో ఈ కామెంట్స్ ఎందుకు ..

ఆక్సిజన్ మీద టాక్స్ వేస్తున్నారు అని అంటున్నారు..

అలా వెయ్యక పోతే నష్ట పొయ్యేది ఆక్సిజన్ తయారు చేసే వాడే..
ఆక్సిజన్ తయారు చేయడానికి తను ఏవైతే సరుకులు వాడుతాడో, దాని మీద టాక్స్ కడుతాడు..

ఇప్పుడు ఆక్సీజన్ అమ్మెటప్పుడు తను కట్టాల్సిన టాక్స్ నుంచి పైన కట్టిన టాక్స్ ను తగ్గించి కడుతాడు..
Ex - Tax Paid on Materials used to prepare Oxygen - 100. This is called as I put Tax.

Tax Payable on Sale of Oxygen - 150.

Net Tax Payable to Government - 150-100 = 50.
ఇప్పుడు మీరు చెప్పే విధంగా ఆక్సిజన్ మీద టాక్స్ ఎతెస్తే...

ఆక్సిజన్ తయారు చేసేవాడు కట్టిన Input Tax నష్టం కలుగుతుంది...

ఈ విషయం తెలుసుకోండి..
అప్పుడు sanitary pads మీద ఇలాగే ఉద్యమం లాగా చేశారు, మళ్ళీ ఒక మూడు నెలలకు తెలిసింది తయారు చేసే వారు ఎంత input టాక్స్ నష్టపోతున్నారు అని..
ప్రతి విషయం లో ఆవేశం పనికి రాదు, ఆలోచన కూడా ఉండాలి..

మీకు విషయం తెలియక పోతే, మీ పార్టీని సమర్థించే టాక్స్ వాళ్ళతో కనుక్కోండి GST ఎలా పని చేస్తుంది అని..
అంతే కాని, విషయం తెలియకుండా, ఏంటి పీల్చే గాలి మీద టాక్స్ కట్టాలా లాంటి సినిమా డైలాగులు సినిమా లో బాగుంటాయి కానీ, నిజ జీవితం అలా ఉండదు...

టాక్స్ వెయ్యక పోతే, ఆక్సిజన్ తయారు చేసేవాడు గాలి లో కలిసిపోతాడు..

శుభం
You can follow @_dinakar_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: