తెలంగాణ‌లో కొవిడ్ బెడ్స్ అందుబాటు ఆన్‌లైన్‌లో ట్రాక్
హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో కొవిడ్ బెడ్స్ రియ‌ల్ టైం ల‌భ్య‌త‌ను https://health.telangana.gov.in/  వెబ్‌సైట్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడూ అందుబాటులో ఉంచ‌నుంది.
కొవిడ్‌-19 ఆస్ప‌త్రుల ప‌డ‌క‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా అప్‌డేట్ చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. ఈ వెబ్‌సైట్ ప్ర‌కారం బుధ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ప్ర‌స్తుతం 16,140 మంది కొవిడ్ పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్ర‌వ్యాప్తంగా 27,061 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో 9,838 ఖాళీలు ఉండ‌గా అదే ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 17,223 ప‌డ‌క‌లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంమీద రెగ్యులర్, ఆక్సిజన్, ఐసీయూ పడకలతో కొవిడ్ -19 రోగులకు 43,201 పడకలు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో 13,860 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఉండ‌గా 29,341 పడకలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నాయి.

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బెడ్స్ వివ‌రాలు..రెగ్యుల‌ర్ ఐసోలేష‌న్ బెడ్స్ మొత్తం 5509. వీటిలో నిండిన‌వి 754 కాగా ఖాళీలు 4,755.
ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాతో కూడిన బెడ్స్ మొత్తం 6,457. వీటిలో నిండిన‌వి 2,403 కాగా ఖాళీలు 4054.
వెంటిలేట‌ర్స్‌తో కూడిన‌ ఐసీయూ బెడ్స్ మొత్తం 1894. వీటిలో నిండిన‌వి 865 కాగా ఖాళీగా ఉన్న‌వి 1029.
ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో బెడ్స్ వివ‌రాలు..
రెగ్యుల‌ర్ ఐసోలేష‌న్ బెడ్స్ మొత్తం 13370. వీటిలో నిండిన‌వి 3099. ఖాళీగా ఉన్న‌వి 10,271.
ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాతో కూడిన బెడ్స్ మొత్తం 9,320. వీటిలో నిండిన‌వి 5,269. ఖాళీగా ఉన్న‌వి 4,051.
వెంటిలేట‌ర్స్‌తో కూడిన ఐసీయూ బెడ్స్ మొత్తం 6651. వీటిలో నిండిన‌వి 3,750. ఖాళీగా ఉన్న‌వి 2901.
You can follow @ashapriya09.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: