మేధావి లాంటి పెద్ద పదాలు ఎందుకు లెండి.
కేవలం చట్టాలు కాస్త జాగ్రత్తగా చదివి అర్థం చేసుకునే వ్యక్తి - అరకొర జ్ఞానంతోటో, లేక రాజకీయ లబ్ధికోసమో జనాలను తప్పుదోవ పట్టించని వ్యక్తి అంటే సరిపోయేది.

ఎందుకంటే 👇 https://twitter.com/SkWarangal/status/1385446711460614144
వాస్తవాలు ఇవి:
122వ సవరణ బిల్లు ద్వారా భారత రాజ్యాంగాన్ని మార్పు చేసి GST Council ఏర్పాటు చేయడం జరిగింది.
👇
ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పరచిన జీ.ఎస్.టీ కౌన్సిల్ యొక్క అధికారాల్లో కొన్ని ఏంటంటే:

1. ఏదైనా కొత్త వస్తువు (గూడ్స్) లేదా సర్వీసుని జీ.ఎస్.టీ పరిధిలోకి తేవడం.
2. అప్పటికే జీ.ఎస్.టీ పరిధిలో ఉన్న ఎటువంటి వస్తువు లేదా సర్వీసుని జీ.ఎస్.టీ పరిధి నుండి తీసివేయడం
👇
అలాగే ప్రత్యేకించి పెట్రోలు/డీజిల్ లాంటి ఇంధనాలని జీ.ఎస్.టీ పరిధిలోకి ఎప్పుడు తేవాలని (ఏ రోజు నుండి) నిర్ణయించడం

👇
అయితే ఇటువంటి నిర్ణయాలు ఈ జీ.ఎస్.టీ కౌన్సిల్ ఎలా తీసుకోవచ్చునో కూడా ఇదే రాజ్యాంగ సవరణ చట్టం నిర్దేశించింది

అది ఎలా అంటే:
జీ.ఎస్.టీ కౌన్సిల్ లో నాలిగింట మూడొంతుల (3/4ths majority) మెజారిటీ (ఆధిక్యంతో) మాత్రమే ఎటువంటి నిర్ణయమైనా తీసుకోగలదు.

👇
అయితే: జీ.ఎస్.టీ. కౌన్సిల్ ఓట్ల బరువును ఈ విధంగా అదే చట్టం నిర్దేశించింది.

మూడింతల ఒక వంతు - కేంద్ర ప్రభుత్వ ఓటు విలువ
మూడింతల రెండు వంతులు - అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఓట్ల విలువ.

1/3rd weight - Center
2/3rd weight - All States together.

👇
అయితే మన శివ గారు (వరంగల్ వారు) చెప్పిన దాని బట్టి
కేంద్రం + 50% రాష్ట్రాలు కలిస్తే ఇంధనాలు, మత్తుపానీయాలు జీ.ఎస్.టీ కిందికి తీసుకురావచ్చునన్నారు.

లెక్క చూద్దాం:
కేంద్రం = 33.33 శాతం ఓట్లు.
రాష్ట్రాలన్నీ = 66.66 శాతం ఓట్లు.
50% రాష్ట్రాలు = 33.33% ఓట్లు.

👇
మరి
కేంద్రం + 50% రాష్ట్రాల ఓట్లు కలిపితే వచ్చేది
33.33% + 33.33% = 66.66 శాతం ఓట్లు.

కావలసిన ఓట్లు = 3/4 మెజారిటీ.
అంటే 75% ఓట్లు.

శివా గారూ, నేనైతే మీరు ఈ చట్టం పూర్తిగా చదివక కేవలం మెజారిటీ (50%) రాష్ట్రాల సపోర్ట్ ఉంటే సరిపోతుంది అని ఆనుకున్నారనుకుంటున్న.

👇
మీ మిగతా దారం (థ్రెడ్) అంతా ఈ తప్పుడు అవగాహన (misunderstanding of the law) మీద ఆధారపడింది కాబట్టి ఇక నేను అందులో చెప్పిన విషయాలపై ఎక్కువగా స్పందించడంలేదు.

ఒకవేల జీ.ఎస్.టీ చట్టంపై నా అవగాహనలో ఏదైనా తప్పుంటే తప్పక సవరించండి. నేర్చుకుంటాను.

ఇక సెలవు.

🙏
టాగ్ చేయడం మరిచాను. మన్నించండి.
@SkWarangal
You can follow @krporeddy.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: