నిన్న ఒక బీజేపీ మహా మేధావి @krporeddy , అన్నీ GST కింద లేవు కేటీఆర్ గారు, మీరు పెట్రోల్ మరియు లిక్కర్ కూడా GST కిందికి తెచ్చేలా ఒప్పుకోండి, అప్పుడు అన్నీ కేంద్రమే చూసుకుంటుంది అని.. జరంత ఈ థ్రెడ్ మొత్తం సదివి అర్థం చేసుకొని సమాధానం చెప్తే బావుంటుంది..
GST కిందికి తేవడానికి మెజారిటీ రాష్ట్రాలు చాలు.. పెట్రోల్, లిక్కర్ ను GST కిందికి తెద్దాం అని ముందు మీ BIMARU రాష్ట్రాలను ఒప్పించండి చాలు, చాతకాదా?? పోనీ మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో అమలు పరిచి, అద్భుతాలు చేసి చూపించి మిగతా రాష్ట్రాలను అడగొచ్చు కదా? అదీ చాతకాదా?
ధనిక రాష్ట్రాలదగ్గర పన్నులు వసూలు చేసి, మీ BIMARU రాష్ట్రాలకు, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు రాజకీయ దురుద్దేశంతో, అధికార దాహంతో వరాలిచ్చుకుంటూ, అన్ని పన్నులు ఇస్తున్న రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా ఉత్త చేతులు చూపిస్తున్నది చాలట్లేదా?
అయినా అన్నీ మీ దేవుని దగ్గరనే, కేంద్రం చేతిలోనే పెట్టుకుంటే, మరి ఇంక రాష్ట్రాలు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు.. అన్ని రాష్ట్రాలను కలిపేసి దేశం అంత ఒక్కటే, ఒక్క ప్రభుత్వం చాలు అని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి అన్నీ మీ దేవుని చేతుల్లోకి తీసుకుంటే ఐపోతాది కదా..
అసలు కేటీఆర్ చెప్పింది ఏంటి, మీరు అన్నది ఏంటి? కేంద్రం ముందు ఆర్డర్ చేసిన 10 కోట్ల వాక్సిన్లకు 150 రూపాలంట, ఇపుడు రాష్ట్రంగాని కేంద్రంగాని ఆర్డర్ చేస్తే 400 రూపాయలట.. ఎందుకీ వ్యత్యాసం, ఒకే ధర ఉండేలా చెయ్యొచ్చు కదా అని అడిగారు, తప్పేముంది?
130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఏ లెక్కన, ఏ ప్రాతిపదికన కేవలం 10 కోట్ల డోసులు మాత్రమే ఆర్డర్ ఇచ్చారు? ప్రపంచంలో అన్ని దేశాలు ఉచితంగా వాక్సిన్లు ఇస్తుంటే, మన దేశంలో ఇలా రాష్ట్రాలకు వదిలెయ్యడం కేంద్ర ప్రభుత్వం చాతగాని తనం కాదా?
లక్ష కోట్ల రూపాయల రుణాలు కార్పొరేట్లకు మాఫీ చెయ్యొచ్చుగాని, 130 కోట్ల మంది జనాలకు మొదటి 150 రూపాయల లెక్క ప్రకారం దాదాపు 20 వేల కోట్లు పెట్టి ముందే ఆర్డర్ ఇచ్చేస్తే దేశం మొత్తం ఎంత సంతోషంగా ఉండేది, మీ దేవుణ్ణి ఎంత గౌరవంగా చూసేది? ఎందుకు చేయలేకపోయారు అలా?
వాక్సిన్ల కోసం 35 వేల కోట్ల రూపాయలు కేటాయించాము అన్నారు మీ కేంద్ర మంత్రి గారు, మరి అవన్నీ ఏమైపోయాయి? ముందు నుండి వాక్సిన్లను మీ గుప్పిట్లో పెట్టుకొని, ఇతర దేశాలకు అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లు యెడ పెడా పంపించి, ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోతుంటే రాష్ట్రాల మీదకు తోసెయ్యాలా?
అధికార వ్యాయామోహం తో కాకుండా, కనీసం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా, సౌమ్యంగా సఖ్యంగా, ప్రజాస్వామ్య యుతంగా, అన్ని రాష్ట్రాలను ప్రాంతాలను కలుపుకొని పెద్దరికంతో ముందుండి నడిపించే తెలివి ఉండొద్దా ఒక దేశ ప్రధానికి?
సైన్టిస్టులు, ఇంజినీర్లు, జవాన్లు.. వాళ్ళ కష్టంతో వచ్చే ప్రతిఫలాన్ని మీ దేవుడి గొప్పతనంగా ఊదరకొట్టుడు, అదే దేశంలో ఏ తప్పు జరిగిన, ఏ ప్రమాదం వచ్చిన, ఏ అపాయం వచ్చిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీదకి తోసెయ్యడం.. ఇదేనా ప్రజాస్వామ్య స్ఫూర్తి??
ఇప్పటికి ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా అసలు మోదీ ప్రధానిగా మన దేశానికి చేసిన గొప్ప పనులేంటి, మనం సాధించిన ఘనతలు ఏంటి, మోదీ ని ఎందుకు ప్రధానిగా మళ్ళీ ఎన్నుకోవాలి అన్నదానికి సూటిగా సమాధానం చెప్పే తెలివి లేదు..
మీరు అందరిని వేలెత్తి చూపించొచ్చు, గొంతెత్తి అరుస్తూ తిడుతూ ప్రశ్నించొచ్చు, అలాంటిది ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆవేదనతో మీ దేవుణ్ణి ప్రశ్నిస్తే మీకు నొప్పి లేస్తుందా? మీరేమైనా పై నుండి ఊడి పడ్డారా? రోజులు లెక్కపెట్టుకోండి మాస్టారు..

