‘‘ రెండు కిలోల ఆశీర్వాద్ వీట్, రాగి పిండి ప్యాక్ చేయండి...’’ అని కిరాణా షాప్ లో బిల్ పే చేయబోతుంటే...
‘‘ అన్నా కిలో బియ్యం ఎంత...?’’ అని అడుగుతోంది ముక్కుకు చెంగు చుట్టుకున్న అమ్మాయి. పాతికేళ్లు ఉండచ్చు...కాళ్లకు చెప్పులు లేవు. చేతిలో చిన్న సంచి...
‘‘ నువ్వు కొనలేవులే ఎల్లమ్మా
...’’ అని విసుక్కున్నాడు. షాపతను.
‘‘ ఎక్కడుంటావమ్మా...?’’ అని అడిగాను.
‘‘ యూసఫ్ గూడ బస్తీలో అన్నా... పనిపోయింది. పైసలు లేవు.. ఇరవై రూపాయలే ఉన్నయి... రెండు రోజుల నుండి బ్రెడ్ తింటున్నాం..’’ అన్నది. ఇంకా వివరాలు అడగాలని పించ లేదు.
‘‘ నీకేం కావాలో తీసుకోమ్మా...’’ అని
షాపతను వైపు తిరిగి ఆమె బిల్లు కూడా నా దాంట్లో కలిపేయి.. అన్నాను.
‘‘ కిలో బియ్యం , కొంచెం కందిపప్పు చాలన్నా ..’’ అంది, ఆమె అమాయకంగా...
ఉచితంగా తీసుకోవడానికి ఆమెకు ఆత్మాభిమానం అడ్డువస్తున్నట్టు అనిపించింది.
‘‘ నెలకు సరిపడా సరుకులు తీసుకొని వెళ్లమ్మా... ఇపుడు నేను పైసలు ఇస్తా
నీకు పని దొరికినపుడు, నాకు తిరిగి ఇయ్యి... ఈ షాపుతనకి నా వివరాలు తెలుసు. ’’ అని ఆమెకు కావాల్సినవి ప్యాక్ చేయించి ఆటో ఎక్కించి పంపాక,
‘‘ అమె మళ్లా ఇస్తాదంటారా సార్...?’’ అన్నాడు షాపతను.
‘‘ అమె ఇస్తుందా, లేదా వేరే సంగతి, మనం ఉచితంగా సాయం చేసినట్టు అమె ఫీల్ కాకూడదు.
కష్ట జీవులకు ఆత్మాభిమానం ఎక్కువ. దానిని గౌరవించాలి.’’ అని, మొత్తం బిల్ పే చేశాను.
షాపతను, రెండువందలు తిరిగి ఇచ్చాడు!!
‘‘ మీరు అంత చేసినపుడు, నేను కూడా కొంత చేయాలి కదా...వ్యాపారంలో పడిపోయి, ఏదో మిస్ అవుతున్నట్టుంది సార్..ఇపుడు మనసుకు ఎంతో హాయిగా ఉంది..’’
అని నాకిష్టమైన లిమ్కా బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చాడు......https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Gefaltete Hände" aria-label="Emoji: Gefaltete Hände">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Gefaltete Hände" aria-label="Emoji: Gefaltete Hände">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Gefaltete Hände" aria-label="Emoji: Gefaltete Hände">

ఎవరో మారలేదు అని అనుకునే బదులు..ఆ మార్పు అనే ముందు అడుగు మనమే వేస్తే సరిపోతుంది.https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Gefaltete Hände" aria-label="Emoji: Gefaltete Hände">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Gefaltete Hände" aria-label="Emoji: Gefaltete Hände">
You can follow @Radhikachow99.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: