ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం "hate" గేమ్ నడుస్తోంది. ఇందుకు భయంకరమైన భాష వాడి ద్వేషాన్ని పెంచుతున్నారు. ప్రజలను కులం, మతం, ప్రాంతాలు గా చిత్రీకరించి, ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచుకుని, ఒకరితో ఒకరు గొడవ పడి, రాష్ట్రంలోని అసలు సమస్యలు మరచిపోయి,  రాజకీయ నాయకులను ప్రశ్నిచటం (1/17)
మరచి పోయేలా, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని, ఏదో ఒక పార్టీకో,  కులానికో, వర్గానికో  భక్తులుగా మారిపోయేలా భయంకరమైన  రాజకీయం నడుస్తోంది. "Hate" అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను "suffocate" చేస్తోంది.

అక్షరమాలలో.. మొదటిది మన రాష్ట్రం. "A" - for Andhra Pradesh. కానీ  A-Z మొత్తం (2/17)
నాశనం అయిపొయింది. ప్రతిపక్షం లో వున్నప్పుడు భయంకరమైన పోరాటాలు చేస్తామని అంది వైసీపీ, నువ్వు ఎందుకు చెయ్యలేక పోతున్నావు అని తెలుగుదేశాన్ని నిలదీసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది వైసీపీ. సార్.. సార్.. సార్.. అనడం తప్ప మనం చెయ్యగలిగింది ఏమీ లేదు, వాళ్ళకి పూర్తి మెజారిటీ (3/17)
వుంది అంటోంది. అప్పుడు చెయ్యలేదు అనిపించుకున్న తెలుగుదేశం.. ఇప్పుడు వైసీపీ ఎందుకు చెయ్యలేదు అని అడుగుతోంది.

బిజెపి, కాంగ్రెస్ లు కూడా ఇంతే. కేంద్రం చక్కగా తన పనులు తాను చేసుకుని పోతోంది.. నిధులు ఇవ్వాల్సిన పని లేకుండా! ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలో వున్నా, కేంద్రం (4/17)
చెప్పినట్లు వినాలి. లేదంటే కేసులు అనే భయాన్ని చూపిస్తున్నారు. ఇక ఆంధ్ర రాష్ట్రం A తో Z, ఎలా నష్టపోయిందో చూద్దాం.

A: అనంతపూర్ - అమరావతి ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, ఏపీ reorganization act లో వుంది.

B: bifurcation of assets and liabilities, శీలా బీడే కమిటీ (5/17)
ప్రకారం, ఆస్తుల మరియు అప్పుల విభజన. జరిగిందా??

C: capital city central support, ఇచ్చారా??

D: దుగ్గిరాజ పట్నం పోర్ట్, ఏమైంది??

E: expansion of విశాఖపట్నం, విజయవాడ and Tirupati airports to international airport standards. చేశారా??

F: financial support, ఇచ్చారా??(6/17)
G: greyhound training centre, estimated at 860 crores. ఇచ్చారా??

H: higher education counsel assets. ఇచ్చారా?? కోర్టులు ఆంధ్రకు ఇవ్వమని చెప్పినా గానీ,  కేంద్రంలో వున్న బిజెపి, ఆంధ్రకు అవసరం లేదని.. చట్టం చేస్తానని చెప్పింది.

I: integrated steel plant, కడప. పెట్టారా?? (7/17)
J: jaitley announcement on resource gaps. అరుణ్ జైట్లీ భయంకరమైన announcement చేశారు దీని గురించి,  ఇస్తాం..ఇస్తాం అని. ఇచ్చారా??

K: కాకినాడ పెట్రో chemical complex, ఇచ్చారా??

L: legislative assembly seat పెంపకం, చేశారా??

M: metro rail, Vijayawada to Vizag, వచ్చిందా?? (8/17)
N: National highways  Hyderabad, సూర్యాపేట, నందిగామ, కోదాడ, విజయవాడ, అమరావతి - nh65 -275 kms పొడవు highway వచ్చిందా??

Hyderabad, nagarjuna Sagar, మాచర్ల, సత్తెనపల్లి, అమరావతి -290 kms పొడవు - NH565 వచ్చిందా??

Vijayawada to భద్రాచలం - 171 kms highway, NH 30, వచ్చిందా??
(9/17)
Amaravathi ఔటర్ రింగ్ రోడ్డు, వచ్చిందా??

O: ongc kg basin royalties, మనకి చెల్లించాలి. చెల్లించారా?

Q: Qualitative education and health infrastructure, వచ్చాయా?

R: rapid road rail connectivity from new capital city, వచ్చాయా?

S: schedule 9, 10 - ఆస్తుల పంపకం, వచ్చాయా?? (10/17)
U: union cabinet decision on special category status. కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి, ప్రణాళికా సంఘానికి పంపించింది.  ఏమైపోయింది  status? అప్పుడు టిడిపి వాళ్ళని  ప్యాకేజీకి ఒప్పుకుంటారా, దమ్ముంటే ఎంపీ లను రాజీనామా చెయ్యమనండి, పోరాటమంటే కాళ్ళు పట్టుకోవడం కాదు మెడలు వంచడం. (11/17)
మేము పోరాడతాం, కేంద్రం మెడలు వంచి స్పెషల్ status సాధించి తెస్తాం. మీ ఎంపీలతో రాజీనామా చేయించండి, మా ఎంపీలు చేస్తారు అని వైసీపీ వాళ్ళు సవాలు విసిరారు. కాలేజీలన్నీ తిరిగారు. ఇప్పుడు అధికారం లోకి వచ్చారు. మేము సాధించలేం. చాలా దూరం అయిపోయే పరిస్థితి. ఏమీ అనలేం.  ఇదీ పరిస్థితి!! 12/17
V: Vizag Chennai industrial corridor - VCIC. వచ్చిందా??

W: water management boards, పెట్టారా??

X: xeric area development ప్యాకేజ్, వెనుకబడిన 7 జిల్లాలకు. వచ్చాయా??

Y: year 1, financial deficit. 16 వేల కోట్లు, ఇచ్చారా??

Z: zone, railway zone... వచ్చిందా?? (13/17)
P: పోలవరం ప్రాజెక్టు, ఏమై పోయింది??

A to Z,. ఆంధ్ర ప్రదేశ్ కి సున్నా..

ఏం పోరాడుతున్నారు.. ఈ అధికార, ప్రతిపక్ష పార్టీలు? మళ్ళీ ఎదురు ఒకరి మీద ఒకరు విమర్శలు. భాష.. భయంకరమైన భాష. అమరావతి కేంద్రంగా అన్యాయం జరిగిందని అందరిపై తోసేస్తున్నారు. అమరావతికే కాదు అన్యాయం జరిగింది. (14/17)
ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికి జరిగింది అన్యాయం.

13 జిల్లాలకు జరిగింది అన్యాయం.

అయిదు కోట్ల ఆంధ్రులకు జరిగింది అన్యాయం.

అన్ని రంగాలకు జరిగింది అన్యాయం.

రాయలసీమకు  జరిగింది అన్యాయం.

ఉత్తర ఆంధ్రకు జరిగింది అన్యాయం.

కాకినాడ, గోదావరి జిల్లాలకు  జరిగింది అన్యాయం. (15/17)
కృష్ణ, గుంటూరు జిల్లాలకు జరిగింది అన్యాయం.

ప్రకాశం జిల్లాకు జరిగింది అన్యాయం. 

13 జిల్లాలకు జరిగింది అన్యాయం.

ఇవేమీ పోరాడరు.

ఇవి పక్కన పెట్టీ, రైతు టర్కీ టవల్ వేసుకున్నా డా, టీషర్ట్ వేసుకున్నాడా, లాంటి భాష వాడుతున్నారు. (16/17)
మొన్న ఈ మధ్య ఒక బిజెపి నాయకుడు, ఒక మహిళా రైతు ఏబై వేల రుపాలయ చీర కట్టింది అని మాట్లాడతాడు.

ఇవా వీళ్ళు మాట్లాడ వలసిన విషయాలు?? 😱😱😱😡😡😡(17/17)
You can follow @mana_maata.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: