చేనేత కార్మికులకు అండనిస్తున్న మిత్రత్రయానికి అభినందనలు - శ్రీ @PawanKalyan గారు...

Read and share the Thread 👇👇👇
నూతన ఆవిష్కరణకు సామాజిక బాధ్యతను జోడించి చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న శ్రీ దినేష్, శ్రీ రామ్ కల్యాణ్, శ్రీ పి.వి.అభిషేక్ అభినందనీయులు. చేనేత అనేది ఎంతో సృజనాత్మకమైన కళ.
ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నవారికి కష్టాలు, కన్నీళ్లు పడుగుపేకల్లా అల్లుకొని ఉంటాయి. ఎమ్మిగనూరు, మదనపల్లె, మంగళగిరిల్లో చేనేత కార్మికులను కలిసినప్పుడు వారు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలోనూ వారెన్నో ఇబ్బందులకు లోనయ్యారు.
ఎన్.ఐ.టి.లో చదువుకున్న ముగ్గురు మిత్రులు – శ్రీ దినేష్, శ్రీ రామ్ కల్యాణ్, శ్రీ అభిషేక్ లు  ఒక యాప్ రూపొందించి చేనేత కార్మికులకు కష్టానికి తగ్గ ఫలం దక్కేలా చేయడం స్ఫూర్తిదాయకం. ఆ కార్మికుల కష్టాన్ని కళ్ళారా చూసి స్పందించారు కాబట్టే చక్కటి ఈ-ప్లాట్ఫార్మ్ సిద్దమైంది.
నిజమైన నేతన్నలను, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు కాబట్టే కష్టపడ్డవారికి తగిన ప్రతిఫలం వెళ్ళే మార్గం ఏర్పడింది. వాస్తవానికి ఇటువంటి ప్రయత్నాలను రాష్ట్ర చేనేత, జౌళి శాఖలు చేయాలి.
యువత స్పందించడమే కాకుండా ఒక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరం అని @PawanKalyan గారు అన్నారు.
You can follow @HemasundarJanas.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: