కేంద్రం మెడలు వంచుతా అని చెప్పి, మీ అన్న ప్రత్యేక హోదా తెస్తా అని నమ్మించి గెలిచి, మాట్లాడితే చీటికిమాటికి ఢిల్లీ వెళ్లి కాళ్ళ మీద పడి, ప్రత్యేక హోదా తేలేను అని చేతులెత్తేసినప్పుడు. (1) ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినలేదా?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి మద్దతు ఇచ్చి, జిల్లాల మధ్య
చిచ్చు పెట్టడం ఇష్టం లేదు అని మాట ఇచ్చి, అధికారం చేతికి వచ్చాక మూడు రాజధానులు అంటూ, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ, భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేస్తూ, రాష్ట్రాన్ని ముక్కలు చేసే దిశగా, ఆంధ్ర కి రాజధాని అనేదే లేకుండా చేస్తున్నప్పుడు. (2) ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినలేదా?
అత్యంత కిరాతకంగా ఒక ఆడ బిడ్డని అత్యాచారం చేసి ఉరి తీసి చంపేస్తే, ఆ తల్లి కొన్ని సంవత్సరాలుగా న్యాయం చేయండి అని పోరాడుతుంటే చలనం లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది మాకు సంబంధం లేదు. అని చేతులు దులిపేసుకున్నప్పుడు. (3) ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినలేదా?
అధికారంలో రాగానే, కనిపించిన ప్రతి దానికి రంగులు వేస్తూ కోర్టు చేత మొట్టికాయలు తిని, వేసిన పార్టీ రంగులు వెంటనే తొలగించకపోతే కఠిన చర్యలు ఉంటాయి అనగానే, వెయ్యడానికి వేసిన రంగులు తీయడానికి కొన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు. (4) ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినలేదా?
మద్యపానం నిషేధం అన్నాడు, మధ్యలో రేట్లు పెంచి దశలవారీగా మద్యపానం నిషేధం చేస్తా అంటూనే కొత్తకొత్త బ్రాండ్లు తీసుకొస్తున్నప్పుడు. (5)ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినలేదా?

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో మీ అన్న చేసిన అన్యాయాలకు అక్రమాలకు, పద్ధతి లేని పథకాలకు, పరిపాలన రాని పాలనకు,
కొన్ని వందల సార్లు ఆంధ్రుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

దీనికి పరిహారంగా క్షమాపణ సరిపోదు, మీ నాయకుడు రాజీనామా చేసి పక్కకుపోతాడా చెప్పండి???

Thread Source @Himabindupspk
You can follow @bhemamani.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: