One Year for the biggest unsuccessful strike ever - ఓ వృధా ప్రయత్నానికి ఏడాది

కార్మికుల మొండితనానికి - ప్రభుత్వాల మూర్ఖత్వానికి 52 రోజుల పాటు ప్రజలకి ప్రత్యక్ష నరకం చూపించి ఏడాది.

A Quick look into the Inhuman behaviour of TG Government on RTC Employees

#TSRTCStrike
అధికారానికి ధిక్కారం గొంతుక అంటేనే గిట్టదు. అలాంటిది అక్కడ ఉన్నది అహంకారానికి పరాకాష్ట ..

సమ్మె మొదలవగానే,చర్చలకి పిలవడం,సానుకూల వాతావరణం ఏర్పాటు చేయడం అనే ప్రతిపాదనే లేకుండా. ఒకే ఒక స్టేట్మెంట్ తో ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తీసేస్తున్నాం ఆని ప్రకటించేశారు .
ఆ ఒక్క అనాలోచిత అహంకార పూరిత ప్రకటన మూల్యం కొన్ని పదుల ప్రాణాలు,కొన్ని వందల జీవితాలు .

ఎవడు తిరిగి తెస్తాడు ఆ ప్రాణాలను?? ఎవడు తిరిగిస్తాడు వాళ్ళ జీవితాలను ??
ఈయన ముఖ్యమంత్రి ...ఇది ముఖ్యమంత్రి స్టేట్మెంట్

కార్మికులు అని పక్కన పెట్టు..మనుషులు ..నీ లాంటి మనుషులే.. మనుషులు చస్తుంటే ..నీ నిర్ణయం వల్ల మనుషులు చస్తుంటే మానవత్వం లేకుండా భాద్యతాయుత పదవిలో ఉండి ఈయనిచ్చే స్టేట్మెంట్ ఇదీ..

ఈయనా జాతిపిత.. ఎవనికి??
ఉద్యమాల గడ్డ,పోరాటల భూమి,కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరసన తెలియజేస్తే రక్తం పారించారు.

ఉద్యమ పోరాటంలో ముందుండి నడిపించిన కార్మికుల మీద లాఠీ జూలిపించారు .
ఆ డిమాండ్లు అర్ద రహితమో ఆచరణ సాధ్యం కానివో,ఓసారి కూర్చొని చర్చించడానికి అహం.

నా మీద తిరుగుబాటా అనే అహం
ఇక డ్రైవింగ్ వచ్చీరాని డ్రైవరులు,అనుభవం లేని డ్రైవర్ల వల్ల రోజుకి నాలుగు ప్రమాదాలు షరా మామూలే
పొట్టకూటి కోసం పూటకో రీతిన తిప్పలు పడే సామాన్యుడికి ఈ 52 రోజులు దిన దిన గండం.

వసూలు చేసేది అడ్డగోలు ఛార్జీ, ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం. ప్రైవేట్ వాహనాల్లో నిలువు దోపిడీనే
తెల్లారి లేస్తే చావు నోట్లో తలకాయ్ పెట్టినా అని గప్పాలు కొట్టుకుంటడు.
నిజంగా చావు దాకా పోతే మనిషి బతుకు విలువ తెల్వదా ?? కళ్ల ముందు అమాయక కార్మికులు చస్తుంటే కనికరం లేదు. అమీర్ గాళ్ల .షాదీలకు పోనీకి టైమ్ ఉంది, గరీబోళ్ళ కష్టం ఆలోచించే తీరిక లేదు
కార్మికులతో చర్చలు చేయడానికి స్థాయి అడ్డమొచ్చింది,అహం ఒప్పుకోవట్లేదు.

రోజూ సచ్చి బతుకుతున్న సామాన్యుల గోడు కూడా కనపడలే పెద్దమనిషికి. అంతా మంచిగానే ఉందని బానిస పత్రికలతో ప్రచారం చేస్కునుడు మళ్ళా
ప్రగతి భవన్ల కుక్క సస్తే కేసెసిండు - గరీబోడి గుండె ఆగితే పట్టించుకోలేదు
మా డిమాండ్లు వద్దు,మన్నోద్దు మా ఉద్యోగాలు మాకియ్యు అని కాళ్ళ మీద పడినాకా కడుపు సల్ల పడ్డది,ఆత్మహత్యలు చేస్కోని ,గుండె పగిలి ప్రాణాలు పోగొట్టుకున్న కార్మికుల దినాలు కూడా జరగక ముందే ఇంట్లో విందు భోజనాలు పెట్టి మాయ మాటలు మొదలైనై కడుపుల పెట్కోని సూస్కుంట అని ఉత్త ముచ్చట్లు మళ్ళా షురూ
ప్రతీ డిపో కార్మికులని కలుస్తా అన్నాడు - ఏడాది అయ్యింది .. ఎన్ని డిపోల కార్మికులని కలిసినవ్ ?? ఏం సమస్యలు విన్నవ్ ? ఏం పరిష్కారం చెప్పినవ్ ?? ఒక్కరోజు డ్రామా చేసి జాడ పత్తా లేకుండా పోయిండు .
సమ్మె చేసిన కాలానికి కార్మికుల జీతాలు పడ్డాయి - ప్రభుత్వం మళ్ళా దేవుడి లెక్క అవుపడ్డది ఈళ్ళకు,

కనీసం సానుభూతికి కూడా నోచుకోని సావులు అయ్యినై ఆ పది,పదిహేను మంది కార్మికులవి ..

ఇంక వీళ్ళు వెలగబెట్టిన సమ్మెకి శిక్ష మళ్ళీ గరీబోనికే . చార్జీల మోత .
కండీషన్ లో లేని బస్సుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి .

కొండగట్టు ప్రమాదం ఆ కోవలోదే.

గడచిన ఐదేళ్లలో ఆర్టీసీ హైదరాబాద్ లో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు .. ఛార్జీలు మాత్రం ఆర్నెల్లకోసారి బరాబర్ పెంచుతడు. ఎక్కితే దిగే దాగా ప్రాణం ఉంటదో పోతదో తెల్వదు
హైదరాబాద్,విశ్వ నగరం లో రెండు వేల సిటీ బస్సులు కండీషన్లో లేవు . ఇదీ చిత్తశుద్ది . ఇదీ పని తీరు .
కష్టమోచ్చిందని గోడు వెళ్లబోసుకుంటే తప్పించుకు తిరగాలే .

సమస్య వస్తే కప్పి పెట్టాలే

గొంతు లేస్తే అణిచివేయాలే

మాయ మాటలు చెప్పి దాటేయాలే

సెంటి మెంట్ పేరు జెప్పి బతకాలే .
You can follow @TylerDurden_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: