జనసేన తో నా ప్రయాణం.
మనం న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని జనసేన వైపు లాగడం చాలా ఈజీ. అందుకు నేనే ఉదాహరణ... నేను గతంలో హైటెక్ సిటీలో జాబ్ చేస్తూనే పార్ట్ టైంగా స్విగ్గీ డెలివరీ బాయ్ గా చేసేవాడిని అప్పట్లో... ఒకసారి రాత్రి 8 గంటలకి మాదాపూర్ లో ఒక ఆర్డర్ ఇచ్చి, వర్షం ఎక్కువగా contd...
ఉండటంతో ఒక గంటన్నర పాటు అక్కడే ఉండిపోయాను. డెలివరీ తీసుకున్న అతను నాతో మాటలు కలిపాడు. అలా ఆ సంభాషణ రాజకీయాల దగ్గరకి వచ్చింది. నాకు రాజకీయాల ఆసక్తి ఉండడంతో ఇద్దరం అలాగే మాట్లాడుతూ కూర్చున్నాం. ఆయన జనసేన యాక్టివిస్ట్. నాకు జనసేన గురించి వివరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే contd..
ఇష్టమా అన్నాడు. లేదు అని చెప్పా సినిమాల్లో ఎవరంటే ఇష్టం అన్నాడు. నాగార్జున అని చెప్పా. ఇక నాతో దాదాపు గంటసేపు జనసేన సిద్ధాంతాలు, కార్యాచరణ, గత ప్రభుత్వ వైఫల్యాలు, జనసేన మనకు ఎందుకు అవసరం ఇలా ప్రతి ఒక్కటీ నాకు క్లియర్ గా వివరించాడు. నాకు అప్పటికే జనసేన అంటే అభిమానం ఉండేది. Contd
ఆయన చెప్పేసరికి నాకు కాస్తా ఆలోచన మొదలు అయింది. అంతే అక్కడి నుంచి జనసేన చేసే ప్రతి కార్యక్రమాన్ని పరిశీలిస్తూ వచ్చాను. ఇంకా అభిమానించడం మొదలు పెట్టాను. వెంటనే ఆన్లైన్ లో మెంబర్షిప్ తీసుకున్నా. నా స్నేహితులతో 8 మందికి మెంబర్షిప్ అప్లై చేయించా. మా గ్రామంలో ఉన్న యువతకు బాగా contd..
జనసేన గురించి వివరించా, అలా కనీసం 20 ఓట్ల దాకా వేయించాను. నేను ఉన్న చోట నుండి స్వంత డబ్బులతో నరసాపురం పార్లమెంట్ కు వెళ్లి దాదాపు 2 వారాలు ఎన్నికల ప్రచారం చేశా. దాదాపు 800 కిలోమీటర్లు. నేను నిజానికి సినిమాల్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా రాలేదు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారి contd..
సినిమాలు అంటే పట్టించుకోను. తనకి ఉన్న ఆలోచన ధోరణి, జనసేన సిద్ధాంతాలు నన్ను ఆకర్షణ చేశాయి. ఇక్కడ చాలా మంది సినిమా అభిమానులుగా మారలేక ఫ్యాన్స్ వార్ దగ్గరే ఆగిపోతూ చాలా సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇక్కడ మనం చేయాల్సింది జనసేన సిద్ధాంతాలను న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి చెప్పండి. Contd..
జనసేన పార్టీ ప్రస్తుత పరిస్థితులకు ఎంత అవసరమో వివరించండి. ప్రభుత్వాల వైఫల్యాల వల్ల, నాయకుల దోపిడీల వల్ల మనం ఏమి కోల్పోతున్నామో చెప్పి వాళ్ళ మెదడు ఆలోచనల్లో ఒక చిన్న ఆలోచన పుట్టించండి. తర్వాత వాళ్లే జనసేనకు ఆకర్షితులవుతారు. ఆరోజు ఒకాయన నాకు చెప్పబట్టి, ఈరోజు జనసేన కోసం నేను contd.
జనస్వరం వెబ్ మీడియాను రన్ చేయగలుగుతున్నాను ఆలోచించండి. ఎంత ఆలోచిస్తే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని ఉండాలి. నేను ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ ను కలవలేదు కదా, ఒక సభలో దూరం నుంచి చూసా అంతే.. ఇక్కడ మనం చేయాల్సింది సినిమా వార్స్ కాదు, గ్రౌండ్ లెవల్లో కష్టపడుతున్న వారికి అవగాహన contd..
కల్పించడం. న్యూట్రల్ ప్రజలకి ఒక చిన్న ఆలోచన కలిగేలా వివరించడం. ఇలా నువ్వు 5 నెలలకు ఒకర్ని తయారు చేసినా 2024 కల్లా 10 మందిని తయారు చేయడమే కాక, వాళ్ళు మరో పది మందిని చేస్తారు. 5 నెలలకు ఒకర్ని మార్చలేకపోతే మనం జనసేన పేరు చెప్పుకొని వేస్ట్... ఇకనైనా మారుదాం. Contd..
ఈ ఫ్యాన్స్ వార్స్ వల్ల ఒరిగేదేమీ లేదు. సరికదా మనకే టైం బొక్క. అందరి హీరో ఫ్యాన్స్ కలిసుందాం. మన భవిష్యత్తుని నిర్ణయించుకుందాం. నువ్వు ఫ్యాన్స్ వార్ చేసినంత మాత్రాన నీ భవిష్యత్తుని నీ హీరో మార్చలేడు. నువ్వే మార్చుకోవాలి. కేవలం వినోదంగా ఆహ్వానించండి. సరదాగా ఉండండి. Contd..
పాతికేళ్ల తరువాత జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఉండకపోయినా పార్టీ సిద్ధాంతాలను గౌరవించాలి. ఆయన కూడా భవిష్యత్తు రాజకీయాలనే కోరుకున్నాడు. ప్రస్తుత రాజకీయాలని కాదు. జైహింద్.https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="✊" title="Erhobene Faust" aria-label="Emoji: Erhobene Faust">

#JSPForNewAgePolitics
You can follow @naresh_writes.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: