అమరావతి పై జగన్ రెడ్డి యూ టర్న్ (థ్రెడ్) 👇

అధికారంలోకి రావటం మొదలు అమరావతిని చంపాలని అనేక విష ప్రచారాలను చేసింది జగన్ రెడ్డి మొదట రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు అంటూ మొదలు పెట్టారు అయితే రైతుల ఎవరు దానికి మద్దతు తెలపగపోగా తమ ఇష్ట ప్రకారమే ఇచ్చామని తేల్చి చెప్పారు (1/n)
తరువాత అవి పంట భూములని రైతులకు నష్టం అంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు అయితే రైతులు రాజధాని కోసం త్యాగం చేశామని చెప్పటంతో గమ్మునుండి పోయారు

దీంతో అది సురక్షితమైన ప్రాంతం కాదని వరదలకు గురవుతుందని మరొక వాదనను తెరపైకి తెచ్చారు (2/n)
అయితే దీనిని అన్ని పర్యావరణ అనుమతులతోను నిర్మించారని దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆమోదం కూడా ఉందని తేలడంతో నాలుక కరుచుకుని మరొక అబద్ధాన్ని మొదలుపెట్టారు

అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక స్తోమత సరిపోదని లక్ష కోట్ల వ్యయం అవుతుందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేశారు (3/n)
అయితే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని అక్కడ పరిశ్రమల స్థాపన మొదలైతే అమరావతి నిర్మాణానికి కావలసిన సొమ్ము వాటి నుంచే వస్తుందని చంద్రబాబు గారితో పాటు అనేక మంది నిపుణులు తేల్చి చెప్పటంతో మరొక యూటర్న్ తీసుకున్నారు (4/n)
అక్కడ పునాదులు బలంగా లేవని నిర్మాణానికి పనికిరాదు అంటూ మరొక విష ప్రచారం చేశారు దానికి మద్రాసు-IIT సర్వే చేసి నివేదిక కూడా ఇచ్చినట్లు ఒక ఫేక్ ప్రచారం చేశారు

అయితే మద్రాసు-IIT తాము ఎటువంటి సర్వే చేయలేదని అమరావతికి రాలేదని స్పష్టం చేయటంతో జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు (5/n)
ఇక అన్నిటికంటే ముఖ్యమైన విష ప్రచారం అమరావతి మొత్తం ఒక సామాజిక వర్గానికి చెందినది అది కేవలం కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే చెందినది కాబట్టి అది అమరావతి కాదు కమ్మరావతి అని చంద్రబాబు సామాజిక వర్గం మాత్రమే అక్కడ భూములు కొన్నారు నివాసం ఉంటున్నారు అని (6/n)
అలా అయితే అది కమ్మ సామాజిక వర్గం కాదు రెడ్డి సామాజిక వర్గం అవుతుంది కమ్మ సామాజిక వర్గం 18% భూములు ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి 23% భూములు ఉన్నాయి

పైగా అది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం 1/3 వంతు భూములు ఎస్సీ ఎస్టీలకు చెందినవి జగన్ రెడ్డి చెబుతున్న కమ్మ సామాజిక వర్గం వాటా (7/n)
భూములు 18% అంటే 82 శాతం భూములు ఇతర సామాజిక వర్గాలకు చెందినవి జగన్ వర్గానికే చెందిన రెడ్డి భూములు కమ్మ వర్గం భూముల కంటే ఎక్కువ ఉన్నాయి

తన సామాజికవర్గం పేరు బయటకు రాకుండా కేవలం కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేయడానికి కారణం అది చంద్రబాబు సామాజిక వర్గం కావటమే (8/n)
భూములిచ్చిన వివిధ సామాజిక వర్గాలు 👇

👉 SC & ST - 32%

👉 రెడ్డి - 23%

👉 కమ్మ - 18%

👉 బీసీ - 14%

👉 కాపు - 9%

👉 మైనార్టీలు - 3%

👉 ఇతరులు - 1% (9/n)
ఎకరాల వారీగా భూములిచ్చిన రైతులు

ఎకరం లోపు - 10,035

1-2 ఎకరాల మధ్య - 7,466

2-3 ఎకరాల మధ్య - 10,104

5-10 ఎకరాల మధ్య - 4,421

10-20 ఎకరాల మధ్య - 4,421

20-25 ఎకరాల మధ్య - 269

25 ఎకరాలు పైబడి - 151

మొత్తం ఎకరాలు - 34,323 (10/n)
You can follow @Iloveindia_007.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: