జాతీయ నదులు కార్యక్రమాల్లో బాగంగా జలబిరాదరి సెప్టెంబర్ 14న "నదుల పరిరక్షణ, పునరుద్ధరణ" అనే అంశంపై "మననుడి-మననది" కోసం ప్రత్యేక వెబినార్ నిర్వహించారు.జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మరియు ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ @bolisetti_satya గారు ఈ జూమ్(ఆన్లైన్)మీటింగ్ జరిపారు.
జనసేనపార్టీ లో సామజికసృహ పర్యావరణ పరిరక్షణ మీద పనిచేయు వందలాది ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సమావేశంలో ప్రముఖులు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జలపురుషుడు సంరక్షకులు శ్రీ డా"రాజేంద్రసింగ్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పరంజపే గారు,
సహజ పట్టణాలకు రూపకర్త మరియు ప్రముఖ సైంటిస్ట్ ప్రొఫెసర్ విక్రంసోనీ గారు, ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త ప్రొఫెసర్ శ్రీనివాసన్ వడ్డబగల్కర్ గారు.కేంద్ర మాజీ కార్యదర్శి సామజిక సృహ కలిగిన ప్రముఖ పర్యావరణ మరియు మానవవనరుల ఉద్యమకారులు శ్రీ ఈ ఏ యస్ శర్మ గారు,
జలసాధనసమితి అధ్యక్షులు మరియు నల్గొండజిల్లాలో సొంతభూమి 70 ఎకరాలులో అడవిని సృష్టించడమే కాకుండా పరిసర ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ కొరకు అటవీప్రాంతంగా మార్చిన శ్రీ దూసర్ల సత్యనారాయణ గారు,
ప్రముఖ పత్రికాసంపాదికులు రచయిత & #39;మననుడి-మననది రూపకర్తలలో ఒకరైన శ్రీ ఎం వి ఆర్ శాస్త్రి గార్లు పాల్గొన్నారు
నదులు, సహజ జలాశయాలు ఎలా ఏర్పడతాయి? అనే అంశంపై ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విజయ్ పరంజపే గారు మాట్లాడుతూ.. పుట్టిన ప్రాంతం నుండి సముద్రంలో కలిసే వరకూ ప్రవహిస్తేనే దాన్ని "నది" అంటారు.
అలా ప్రవహిస్తేనే అది ఆరోగ్యంగా ఉంటుంది మనకి మిగతా జీవరాశులకు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఉదాహరణకు కృష్ణా, గోదావరి నదుల నీటి ప్రవాహం మధ్యలోనే ఆగి పోతుంది దాని ఉపనదుల నీరు కొంత మాత్రమే సముద్రంలో కలుస్తుంది ఈ నదులు జీవనదుల స్థాయిని కోల్పోయి మృత నదులుగా పరిగణిస్తారు..
(పూర్తి పాఠం త్వరలో) కృష్ణా నది భౌగోళిక పరిస్థితి గురించి ప్రముఖ జియాలజిస్ట్ ప్రొఫెసర్ వడబగల్కర్ శ్రీనివాసన్ గారు మాట్లాడుతూ కృష్ణా నది భూగర్భ పరిస్తితి కోస్తా తప్ప రాతి పొరలతో నిండి ఉండడం వల్ల నీరు భూమిలోకి త్వరగా ఇంకదని,
అలాగే ఇసుక (జరీబు) భూములపై వ్యవసాయం చేసే రైతులు నీటి పొదుపుగా వాడాలి లేకుంటే నదిలో నీరు ఇంకిపోయి నది చచ్చి పోతుంది, భూగర్భ జలాలను పొదుపుగా వాడాలి అని లేకుంటే నదులు ఎండిపోతాయి అన్నారు. అలాగే ఎక్కువ తీరప్రాంతం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం చాలా జాగర్తలు వహించాలి,
పొరపాటున పరిమితి మించి భూగర్భ జలాలను తోడేస్తే సముద్ర జలాలు చొచ్చుకొని వస్తాయి మొత్తం వ్యవసాయంతో పాటు తాగునీటి కొరత ఏర్పడి మనుషులతో పాటు పశువులు, పక్షులు, జంతువులకూ నష్టం వాటిల్లుతుంది (పూర్తి పాఠం త్వరలో)
ఇసుక నది యొక్క అంతర్భాగం దాని పరిరక్షణ ఆవశ్యకతపై సహజ పట్టణాల రూపకర్త, ప్రముఖ శాస్త్రవేత్త, పర్యావరణ పరిరక్షకుడు ప్రొఫెసర్ విక్రమ్ సోనీ గారు మాట్లాడుతూ వరదలు వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ నీరు నది ఇసుకలో నిలువ ఉంచుకుంటుంది ఆనీరే ప్రవాహం తగ్గినప్పుడు తీసుకొని ప్రవాహం కొనసాగిస్తుంది.
ఈ ఇసుక తున్నెలలో ఉన్నది స్వచ్ఛమైన నీరు దానిని కాలుష్యం బారినుండి కాపాడాలన్నారు (పూర్తి పాఠం త్వరలో) నదుల పరిరక్షణకు మనకున్న చట్టాలు వాటి అమలుకు ఉన్న అవరోధాలు అనే అంశంపై మాజీ కేంద్ర కార్యదర్శి,
ప్రముఖ సంఘ సేవకులు శ్రీ ఈ ఏ యస్ శర్మ గారు మాట్లాడుతూ "మన నుడి మన నది" ఒక మంచి సామాజిక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం. ఒక రాజకీయ పార్టీ ఇటువంటిది చెయ్యడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది..
బహుశా దేశంలో ఇదే ప్రథమం అని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని, పాల్గొన్న వందలాది మంది యువతని అభినందిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ఎ, పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు మెరుగుపరచడం రాష్ట్ర బాధ్యత అని. అదేవిధంగా ఆర్టికల్ 51A (జి),
సహజ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు మెరుగుపరచడం భారతదేశంలోని ప్రతి పౌరుడిపై ఉందని గుర్తు చేసేరు. సహజ నదులు జలాశయాలు నాశనం అవ్వడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు బాధ్యత వహించాలి అన్నారు (పూర్తి పాఠం త్వరలో)
అడవులకు నదికి ఉన్న అనుబంధం గురించి జలసాధన సమితి అధ్యక్షుడు మరియు తనకున్న 70ఏకరాల పొలంలో ఒక అడవినే సృష్టించిన పర్యావరణ రక్షకుడు శ్రీ దూసర్ల సత్యనారాయణ మాట్లాడుతూ "
"దూడని చూస్తే ఒక ఆవు పొదుగు నుండి పాలు ఎలా వస్తాయో చెట్లను చూస్తే మేఘాలు అలానే వర్షిస్తాయి" అన్న మాటల్లో ఆయన నిష్కల్మమైన మనస్సుని చూడొచ్చు.. (పూర్తి పాఠం త్వరలో)
ప్రముఖ పత్రికా సంపాదకులు, రచయత, చరిత్రకారుడు. "మన నుడి మన నది" రూపకర్తల్లో ఒకరైన శ్రీ ఎమ్ వి ఆర్ శాస్త్రి గారు మొత్తం కార్యక్రమాన్ని వీక్షించి అభినందనలు తెలిపారు.
బొలిశెట్టి సత్యనారాయణ గారు వందన సమర్పణ చేస్తూ వక్తలందరితో పాటు జలనిరాదరి తరపున వెబినార్ నిర్వహించిన పర్యావరణ ప్రేమికులు శ్రీ వినోద్ బోధంకర్, శ్రీ నరేంద్ర చుగ్ గార్లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎప్పుడూ కేరింతలతో హడావుడి చేసే
300మంది జనసైనికులు వీర మహిళలు ఈరోజు 3 గంటలకు పైగా శ్రద్ధగా విన్నారని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఫేస్ బుక్, యూట్యూబ్ లింక్ పనిచేయని కారణంగా కార్యక్రమాన్ని వీక్షించ లేకపోయిన వేలాది పర్యావరణ ప్రేమికుల కోసం ఈ కార్యక్రమం పూర్తి పాఠం అందరికీ పంపుతామన్నరు.