పిట్ట కథ : వాయమ్మో పిడుగు పడింది

1. పక్కోడిమీదబతికేపురం అనే ఊరిలో అజయ్ , విజయ్ అని ఇద్దరు మిత్రులు ఉండేవారు.

ప్రాణ మిత్రులు కాకపోయినా , ప్రాణాలు తీసుకునేంత శత్రుత్వం లేని మిత్రులు వీరు ఇద్దరు.
2. అజయ్ కు తాను ఉన్న ఇల్లుతో పాటు , ఇంకో ఇల్లు కూడా ఉంది. దీన్ని అద్దెకు ఇచ్చే వాడు. ఈ సారి ఇల్లు ఖాళీ అయ్యింది , కొత్త వాళ్ళ కోసం చూస్తున్నాడు అజయ్ .

ప్రతి రోజు కలుసుకున్నట్టే , సాయంత్రం కలిశారు అజయ్ విజయ్. ఇలా తన ఇల్లు ఖాళీ అయ్యింది అని , ఎవరైనా ఉంటె చెప్పమని చెప్పాడు అజయ్.
3. ఈ విషయం విన్న విజయ్, మా బావ ఈ ఊరికి Transfer అయ్యి వచ్చాడు ఇల్లు కోసం చూస్తున్నాడు , రేపు ఉదయం ఇల్లు చూడటానికి పిలుచుకుని వస్తాను అని చెప్పాడు .
4. విజయ్ వాళ్ళ బావ, ఇల్లు చూసాడు నచ్చింది. అద్దె ఎంత అని అడిగాడు అజయ్ ని.

8000 అండి అద్దె, 7వ తేదీ లోపల ప్రతి నెల ఇచ్చేయాలి . అలాగే మూడు నెలల అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్పాడు
5. విజయ్ వాళ్ళ బావ, 8000 నాకు ఎక్కువ అవుతుంది , 6000 దాకా నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పాడు.

లేదండి 8000 కంటే తక్కువ నాకు కుదరదు అండి అని అన్నాడు అజయ్.
6. ఇలా మాటలు సాగుతుంటే , విజయ్ పూనుకుని , బావ అజయ్ ఆగండి ఒక్క నిమిషం.

బావ నువ్వు 6000 ఇవ్వు, మిగిలిన 2000 నేను ఇస్తాను అన్నాడు.

సరేలే , చెల్లలి కోసం ఆమాత్రం చెయ్యడా అని అన్నాడు అజయ్.

అంతా కుదిరింది , మంచి రోజు చూసుకుని ఇంటికి చేరారు విజయ్ వాళ్ళ బావ వాళ్ళు.
7. ఇలా ఒక సంవత్సరం రోజులు జరిగింది , బావ గారు 6000 ఇవ్వడం, విజయ్ 2000 ఇవ్వడం తో ఆలా సాగిపోయింది.

అంతా హాయిగా ఉంది అని అనుకునే లోపు ఒక రోజు పిడుగు పడి అజయ్ వాళ్ళ ఇల్లు కూలిపోయింది.

ఈ వార్త తెలుసుకున్న విజయ్, అజయ్ వాళ్ళ ఇంటి దెగ్గరకు వెళ్లి పరామర్శించాడు.
8. దేవుడి దయ వల్ల ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. సరే అలాగే విజయ్ వాళ్ళ బావ వాళ్ళు కూడా, వేరే ఇల్లు చూసుకుని వెళ్లిపోయారు .
9. మరుసటి నెల 7 వ తేదీ వచ్చింది , అజయ్ నుంచి విజయ్ కి ఫోన్ వచ్చింది.

అంతా బాగానే ఉందా అని అడిగాడు విజయ్.

నీకు తెలియంది ఏముంది, ఏదో ఆలా సాగుతుంది అన్నాడు అజయ్.

ఎమన్నా పని ఉందా , ఫోన్ చేసావ్ అన్నాడు విజయ్.
10. హా అదే , ఇంకా అద్దె వెయ్యలేదు ఎప్పుడు వేస్తావు అని అడగడానికి చేశా అన్నాడు అజయ్.

అదేంటి, అద్దె నేనెందుకు వేస్తాను అని అన్నాడు విజయ్.
11. అప్పుడు అన్నావు కదా , మా బావ కట్టగలిగే అంత కడుతాడు, మిగిలింది నేను ఇస్తాను అని . ఇప్పుడు మీ బావ ఏమి ఇవ్వలేదు, మరి నువ్వే మొత్తం 8000 నువ్వే ఇవ్వాలి నాకు అన్నాడు అజయ్.

తమాషాలు చేస్తున్నావా, అసలు ఇప్పుడు మా బావ అసలు ఇంట్లోనే ఉండట్లేదు , నేనెందుకు ఇవ్వాలి అని అన్నాడు విజయ్.
12. అదంతా నాకు తెలియదు , మీ బావ 6000 నువ్వు 2000 ఇచ్చేవారు కదా , ఇప్పుడు మీ బావ 6000 ఇవ్వడం లేదు , కాబట్టి మొత్తం 8000 నువ్వే ఇవ్వాలి అంతే
13. ఇలా చాల సేపు వాదనలు చేసుకున్నాక ,

నీలాంటి మాట తప్పే వాడితో స్నేహం చెయ్యడం నాది తప్పు . ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ఎగ్గొడతావా , అసలు నువ్వు మనిషివేనా అని తిట్టి ఫోన్ పెట్టేసాడు అజయ్.

ఇది ఏమి గోలరా నాయనా అనుకుని , ఇంటికెళ్లిపోయాడు విజయ్.
14. శుభం :

ఈ కథ మీకు అర్థమైతే , సాయంత్రం కానీ రేపు కానీ వేసే GST thread మీకు సులువుగా అర్థం అవుతుంది
You can follow @_dinakar_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: