ఉచిత విద్యుత్ రద్దు చేసి నగదు బదిలీ చేస్తాను అంటున్న ప్రభుత్వ మాటలపై రైతులకు ఉన్న అనుమానాలు ( త్రెడ్ )
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👇" title="Rückhand Zeigefinger nach unten" aria-label="Emoji: Rückhand Zeigefinger nach unten">
1) ఇప్పటి వరకు బోరు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగానే విద్యుత్ అందించారు మరి ఇప్పుడు కూడా అంతమందికి నగదు బదిలీ చేస్తారా లేదా ఏదైనా సాకులు చూపి కోతలు విధిస్తారా ? (1/n)
1) ఇప్పటి వరకు బోరు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగానే విద్యుత్ అందించారు మరి ఇప్పుడు కూడా అంతమందికి నగదు బదిలీ చేస్తారా లేదా ఏదైనా సాకులు చూపి కోతలు విధిస్తారా ? (1/n)
2) గతంలో బిల్లు కట్టే అవసరం లేదు కాబట్టి రైతు పూర్తిగా విద్యుత్ వినియోగించుకునే వాడు మరి ఇప్పుడు కూడా వినియోగించుకున్న మొత్తానికి నగదు బదిలీ చేస్తారా లేదా ఏదైనా పరిమితి పెట్టి మిగిలిన మొత్తాన్ని రైతు నెత్తి మీద రుద్దుతారా ? (2/n)
3) ఇప్పటి వరకు ఉన్న బోర్లకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తారా లేదా భవిష్యత్తులో వేయబోయే బోర్లకు కూడా వర్తింపచేస్తారా ? లేదా ఏదైనా ఒక సంవత్సరాన్ని పేర్కొని దాని ముందు బోరు వేసిన వారికి లేదా దాని తరువాత వేసిన బోరు అని షరతులు విధిస్తారా ? (3/n)
4) ఇతర పథకాల మాదిరి ఈ నగదు బదిలీ పథకాన్ని కొన్ని వర్గాల వారికే వర్తింపచేస్తారా లేదా బోరు ఉన్న అన్ని వర్గాల వారికి వర్తింపచేస్తారా ?
5) ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని బోర్లు ఉన్న వర్తింపచేస్తారా ? లేదా ఒక వ్యక్తికి ఇన్ని బోర్లే ఉండాలి అని ఏదైనా షరతులు విధిస్తారా ? (4/n)
5) ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని బోర్లు ఉన్న వర్తింపచేస్తారా ? లేదా ఒక వ్యక్తికి ఇన్ని బోర్లే ఉండాలి అని ఏదైనా షరతులు విధిస్తారా ? (4/n)
6) ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకైనా పథకాన్ని వర్తింపచేస్తారా లేదా కొన్ని ఎకరాలు మాత్రమే ఉండాలని పరిమితి విధిస్తారా ?
7) ఒక కుటుంబంలో ఎంత మంది పేరుమీద బోర్లు ఉన్నా అన్నిటికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తారా లేదా కుటుంబం మొత్తానికి కలిపి ఇన్ని బోర్లు మాత్రమే ఉండాలి అని మెలిక పెడతారా ?(5/n)
7) ఒక కుటుంబంలో ఎంత మంది పేరుమీద బోర్లు ఉన్నా అన్నిటికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తారా లేదా కుటుంబం మొత్తానికి కలిపి ఇన్ని బోర్లు మాత్రమే ఉండాలి అని మెలిక పెడతారా ?(5/n)
8) ఆ బోరు కింద ఏ పంట పండినా పథకాన్ని వర్తింపచేస్తారా లేదా పంటను బట్టి ఏదైనా కేటగిరీలుగా విభజిస్తారా ?
9) ఇతర ప్రభుత్వ పథకాల నుంచి సాయం పొందే వారందరికీ వర్తింపచేస్తారా లేదా కొన్ని రకాల ప్రభుత్వ పథకాలు పొందే వారిని దీనినుంచి తొలగిస్తారా ? (6/n)
9) ఇతర ప్రభుత్వ పథకాల నుంచి సాయం పొందే వారందరికీ వర్తింపచేస్తారా లేదా కొన్ని రకాల ప్రభుత్వ పథకాలు పొందే వారిని దీనినుంచి తొలగిస్తారా ? (6/n)
10) విద్యుత్ నగదు బదిలీ పథకం పొందే వారికి మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా లేదా కొన్ని పథకాలను కత్తిరిస్తారా ?
11) ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారి పేరిట బోర్లు ఉన్న వారికి వర్తింపచేస్తారా లేదా అలాంటి వారిని మినహాయింపు చేస్తారా ? (7/n)
11) ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారి పేరిట బోర్లు ఉన్న వారికి వర్తింపచేస్తారా లేదా అలాంటి వారిని మినహాయింపు చేస్తారా ? (7/n)
12) వచ్చే ఆదాయం ఆధారంగా ఈ పథకాన్ని వర్తింపచేస్తారా లేదా ఆదాయంతో సంబంధం లేకుండా బోరు ఉన్నవారందరికీ వర్తింపచేస్తారా ?
13) బోరు ఉంటే సరిపోతుందా లేదా దానికి ప్రభుత్వ అధికారుల నుంచి ఏదైనా గుర్తింపు పత్రం కావాలని మెలిక పెడతారా ? (8/n)
13) బోరు ఉంటే సరిపోతుందా లేదా దానికి ప్రభుత్వ అధికారుల నుంచి ఏదైనా గుర్తింపు పత్రం కావాలని మెలిక పెడతారా ? (8/n)
14) నగదును కౌలు రైతుకు చెల్లిస్తారా లేదా యజమానికి చెల్లిస్తారా ? ఒకవేళ యజమానికి చెల్లిస్తే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం కౌలు రైతే బిల్లులు చెల్లించాలి అంటే మరి కౌలు రైతుకు ఏర్పడిన నష్టాన్ని ఎలా పుడుస్తారు ? (9/n)
15) నగదు ముందు బదిలీ చేస్తారా బిల్లులు చెల్లించిన తర్వాత బదిలీ చేస్తారా ? ముందే బదిలీ చేస్తే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకంగా బిల్లు వస్తుంది మరి ఎంత మొత్తం బదిలీ చేస్తారు ? ఒకవేళ తర్వాత బదిలీ చేస్తే బిల్లులు చెల్లించిన ఎన్ని రోజులకు బదిలీ చేస్తారు ? (10/n)
16) దీన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నడుపుతారా లేదా విద్యుత్ సంస్థలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నం ఏదైనా చేస్తారా ?
ఈ అనుమానాలకు కారణం మీరు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత తూట్లు పొడవటం అలాగే ఇది కూడా జరుగుతుందేమో అని రైతులలో భయం ఉంది (11/n)
ఈ అనుమానాలకు కారణం మీరు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత తూట్లు పొడవటం అలాగే ఇది కూడా జరుగుతుందేమో అని రైతులలో భయం ఉంది (11/n)