1.ఒక అర్థరాత్రి డిస్కషన్ మధ్యలో, నాకు నడుము నెప్పి వస్తోంది సర్ అంటే, ఠక్కున లేచి లోపలికి వెళ్పోతే కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. ఆయన చాప, దిండు తెచ్చి నన్ను పడుకోమని నా పక్కన ప్యాడ్ పెన్ పట్టుకొని కింద కూర్చుని మీరు చెప్పండి నేను రాస్తా అన్నారు . #HBDPawanKalyan
2. అప్పటికి నా మొదటి సినిమా రిలీజ్ కూడా అవలేదు. ఆయన పవర్ స్టార్. 5 రోజుల పరిచయం. గుడుంబా శంకర్ సినిమా కోసం. నాకు తెలీదు ఆ సినిమా లో నా పేరు వేస్తారని. అంత గౌరవం ఇస్తారని.. #HBDPawanKalyan
3. మనిషి ని మనిషి లా గౌరవించే ఆయన గుణం ఆయన వ్యక్తిత్వం లో ఒక భాగం. ఊరికే పవర్ స్టార్ అయిపోరు. ఆయన దగ్గర అబద్ధం ఆడక్కల్లేదు. చప్పట్లు కొట్టక్కల్లేదు. పొగడక్కల్లేదు. మనం మనలా ఉండచ్చు. #HBDPawanKalyan
4. అన్నవరం సినిమా షూటింగ్ మొదలయ్యే టైం కి బొమ్మరిల్లు రిలీజ్ అవలేదు. స్క్రిప్ట్ కోసం, డైలాగ్ కోసం రాత్రి పగలు ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఇంకా గుర్తున్నాయంటే అది ఆయన గొప్పదనం అంతే. #HBDPawanKalyan
5. అన్నవరం టైం లో ఆయనకిచ్చిన నా 1983 చందమామ కధల బౌండ్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, పంజా సినిమా రాయడానికి ముందు ఒక అసిస్టెంట్ తో పంపించి, అందినట్టు కాల్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చారు. "పుస్తకం విలువ తెల్సిన మనిషి కి జీవితం విలువ ఖచ్చితం గా తెలుస్తుంది." #HBDPawanKalyan @PawanKalyan
6. బాధ వస్తే అమ్మ ఒడి ని వెతుక్కునే పసిపిల్లాడు. మంచితనం చూస్తే పరవశం. ఆడపిల్లకి అవమానం జరిగితే ఆవేశం. లేనితనం చూస్తే కంట్లో నీళ్లు. సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన, ఈ లక్షణాలు అప్పటికప్పుడు రావు. బై బర్త్ కూడా కాదు బిఫోర్ బర్త్ నించి ఉండాలి. అంతే. #HBDPawanKalyan @PawanKalyan
7. ఆయన వ్యక్తిత్వం నామాటల్లో చెప్పాలని పంజా సినిమా లో ప్రయత్నించాను. అప్పుడు పుట్టిన మాటలే " సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో , సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు " #HBDPawanKalyan
8. ప్రజల కోసం, ప్రజల పక్కన నిలబడాలన్న ఆయన ఆశయం సంపూర్ణం గా నెరవేరాలని మనస్పూర్తి గా కోరుకుంటూ, ఆయన బాగుంటే కోట్ల మంది బాగుంటారని నమ్ముతూ, ఆయన పెదాల మీద చిరునవ్వు చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan సర్.. #HBDPawanKalyan
You can follow @abburiravi.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: