అల వైకుంఠపురంలో కథని ఒక లైన్ లో చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు "ఎవ్వరికైనా స్థానం ఇవ్వొచ్చు కానీ స్థాయి ని ఇవ్వలేము". ఇది నేను అన్న మాట కాదు. స్వయానా కథని రాసి, డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ అన్న మాట. సినిమా రిలీజ్ కి ముందే కథ బేసిక్ ప్లాట్ ఇదేనని ఇంటర్వూస్ లో త్రివిక్రమ్ స్పష్టం చేసాడు https://twitter.com/DalitChef/status/1298857016673280001">https://twitter.com/DalitChef...
ఈ లైన్ లో "స్థాయి" అంటే అల్లు అర్జున్ పెద్ద ఫామిలీ లో పుట్టడం. ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబం లో పుట్టిన సుశాంత్ కొన్ని సంఘటనలు, కారణాల వల్ల అగ్రకుటుంబం లో స్థానం దక్కుతుంది .
ఇప్పుడు ఈ లైన్ ని మళ్ళి చదవండి. ఎవ్వరికైనా స్థానం ఇవ్వొచ్చు కానీ స్థాయి ని ఇవ్వలేము" అంటే వెనుకబడిన వాడికి స్థానం ఇవ్వోచ్చేమో కానీ "స్థాయి" ని ఇవ్వలేరు అంట. ఇక్కడ స్థాయి ఎలా నిర్ణయించబడింది? పుట్టుకతో
స్థాయి ని పుట్టుక తో కాకుండా వేరే ఇతర కారణాల వల్ల అందుకోలేకపోయారు అని చూపిస్తే బెనిఫిట్ అఫ్ డౌట్ కి ఆస్కారం ఉండేది. అల్లు అర్జున్ ని తన పెంపుడు తండ్రి ఎంత హీనంగా చూసినా, ఎన్ని కష్టాలు పెట్టి ఎదగనియ్యకుండా చేసినా ఆ "స్థాయి" ఎక్కడికి పోదు.
( రాజు ఎక్కడున్నా రాజే : అల్లు అర్జున్ ని ఉద్దేశించి తనని పెంచిన తల్లి చెప్పే డైలాగ్) . మరో వైపు, ఎంత బాగా చూసినా, ఎంత సరైన పద్ధతి లో పెంచిన సుశాంత్ కి మాత్రం ఆ "రాజసం", "స్థాయి" రాదు. ఇందాక చెప్పిన్నట్టు స్థానం ఇవ్వగలం కానీ స్థాయి ని ఇవ్వలేము కదా.
ఇది కులం. కుల వ్యవస్థ. పుట్టుక తో ఒక కులాన్ని ఆపాదించేసి, అగ్రకులం లో పుట్టినవాడు ఎక్కడున్నా రాజే, అణగారిన కులం లో పుట్టిన వాడు ఎక్కడున్నా బానిసే, పనికిమాలిన వాడే. బేసిక్ గా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి అని స్పష్టంగా , అందంగా వంద కోట్లు ఖర్చుపెట్టి అధునాతనమైన సాంకేతికతతో చెప్పాడు
బుద్ధులు, లక్షణాలు, అర్హతలు పుట్టుకతోనే వస్తాయి అనే ఈ పనికిమాలిన కుల పోకడల్ని అందమైన ముసుగు తో తియ్యడం లో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. తెలుగు సినిమా లో దిగజారిన విలువలకి కొదవ లేదు. కానీ త్రివిక్రమ్ అందరికంటే ప్రమాదకారి.
"అతడు" సినిమాలో తనికెళ్ళ భరణి మహేష్ బాబు ని ఉద్దేశించి ఒక మాట అంటాడు. ఎవరైనా కోపం తో కొడతాడు, కసి తో కొడతాడు, వీడేంట్రా ఇంత శ్రద్ధగా కొట్టాడు. త్రివిక్రమ్ కూడా అంతే, చాలా శ్రద్ధగా, Intellectual ముసుగు లో ఇటువంటి ఆలోచనలని ప్రజల్లోకి ఎక్కిస్తాడు
లేదా ఆల్రెడీ ఎక్కిన వాటిని పెంపొందిస్తాడు.
ఈ అభ్యంతరాలని వ్యక్తం చేస్తే, కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నావ్, సినిమాని సినిమాగా చూడలేవా అని పనికిమాలిన ఫాన్స్ బయలుదేరుతారు
ఈ అభ్యంతరాలని వ్యక్తం చేస్తే, కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నావ్, సినిమాని సినిమాగా చూడలేవా అని పనికిమాలిన ఫాన్స్ బయలుదేరుతారు
ఈ వెధవలకి హీరో పోస్టర్స్ కి పాలాభిషేకాలు చేసినప్పుడు, వాళ్ళ హీరో సినిమా బాలేదు అన్న జనాల మీద విరుచుకుపడినప్పుడు , హీరోస్ కి కల్ట్, లార్జర్ థన్ లైఫ్ స్టేటస్ ఇచ్చినప్పుడు "సినిమా ని సినిమా లా" చూడాలి అన్న విషయం గుర్తు రాలేదా?
కేవలం సినిమా అనేది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అని నా లాంటి వాళ్ళు చెప్పినప్పుడే "సినిమా ని సినిమాలా చూడాలి" అనే విషయం గుర్తొస్తుందా?
సోల్జర్స్ గురించి, రైతుల గురించి surface లెవెల్ understanding తో మీ హీరోలు సినిమాలు చేసినప్పుడు మాత్రం మా హీరో రైతులని , దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు అని బిల్డప్ కొడతారు.. అప్పుడు గుర్తు రాలేదా "సినిమా ని సినిమా ల చూడాలి" అని
సమాజం పై Pop -culture influence చాలానే ఉంటుంది. అలాంటి సినిమాల్లో ఇలాంటి status -quo ని ప్రశ్నించకపోగా , పెంపొదించినప్పుడు, తప్పకుండ మనం వ్యతిరేకించాలి. ఇంత regressive ఆలోచనలని స్లో poison లా నీట్ గా ఎక్కించినా, ఎక్కడ పెద్ద చర్చ జరగలేదు.
దీనికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి. అందులో కుల ప్రతీకల్ని గుర్తించలేకపోవడం. రెండోవది- ఇందులో ఏమంత ప్రాబ్లెమ్ ఉంది లే, ఇదేదో పెద్ద విషయం కాదే, అందరం అనుకునేదేగా అని అనుకోవడం. రెండొవదే ముఖ్య కారణంగా నాకు అనిపిస్తుంది. అంటే కులం , కుల పోకడలు అంతలా నార్మలైజ్ అయిపోయాయి
ఇందుకుగాను త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్స్ ని ఇంకా ఎక్కువ కడిగిపారేయాలి. విలువలు, సాంప్రదాయాల ముసుగులో బ్రాహ్మణవాదాన్ని పెంచి పోషిస్తున్నందుకు.
తన సినిమాల్లో ఇటువంటి regressive పోకడల్ని ఊతమందిస్తున్నా, మనం గుర్తించం. ఆల్రెడీ మనలో అవి ఇమిడిపోయి ఉన్నాయి కాబట్టి.
తన సినిమాల్లో ఇటువంటి regressive పోకడల్ని ఊతమందిస్తున్నా, మనం గుర్తించం. ఆల్రెడీ మనలో అవి ఇమిడిపోయి ఉన్నాయి కాబట్టి.