రాయలసీమ లిఫ్ట్ ఇర్రిగేషన్ కథ

మా ఊరి రేషన్ షాపు డీలరు ఎల్లమ్మగారి శేషాడ్డి. నాకు ఒక బియ్యం కార్డు (తెల్ల కార్డు) ఉంది. ఒక్కో కార్డుకు నెలకు 5 కేజీల బియ్యం వచ్చాయి. నెల నెలా నేను సిన్న ప్లాస్టిక్ కవర్ రేషన్ షాపుకు కొండబొయ్యి బియ్యం ఏపిచ్చుకుంటా. ఈ కవర్ నోరు సిన్నది. అందుకని
శేషాడ్డి ఓపిగ్గా ఒక 'పావు' గిన్నె తీసుకుని నా కవర్ లో బియ్యం ఏచ్చాన్యాడు. ఈ మధ్య శేషాడ్డికి ఒంట్లో బాలేదని వాళ్ల కొడుకు ఎంకటరెడ్డి రేషన్ షాపులో కూర్చుంటాండాడు. వాడికి వాళ్ల నాయంనంత ఓపిక ల్యా. 'పావు'తో 4 తూర్లు పోయానీకి ఓపిక లేక ఓకేతూరి 'పడి'తో తటాలున పోచ్చానాడు.
నా కవర్ మూతేమో సిన్నది. పడితో పోచ్చాంటే బియ్యం అన్ని కింద పోతాండాయ్. మనం సెప్పినట్టు డీలర్ ఇంటాడా.అందుకే నేనే కవర్ బదులు పెద్ద గోనె సంచీ తెచ్చుకుంటాడా. పెద్ద 'పడి'తో పోసినా నా 5 kgల బియ్యం నా సంచిలోనే పడతాయి అని నా ఆశ. నువ్వు చిన్న కవరే తెచ్చుకోవాల గోనెసంచి తెచ్చుకోవద్దు అంటానారు
సిన్న కవర్ తెచ్చుకున్యా, పెద్ద గోనె సంచి తెచ్చుకున్యా నాకొచ్చే బియ్యం 5 kgలే. పడితో ఒకే తూరి బియ్యం ఏచ్చే, అయి కవర్లో పట్టకుండా బయట పడి నాకు రావాల్సిన బియ్యం నాకు రావడం ల్యా. అందుకని ఇంట్లో అంతా పచ్చు ఉంటానారు. పెద్ద ఉండే గోనె సంచి తెచ్చుకుంటే నా బియ్యం మొత్తం నాకొచ్చాయి.
అలాగే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44K క్యూసెక్కులైనా లేదా 88K క్యూసెక్కులైనా లేదా నీటిని సంగమేశ్వరం నుండి తోడినా ఎవరి వాటా నీళ్లే వాళ్ళకొస్తాయ్. ఎవరెన్ని నీళ్లు వాడుకుంటున్నారు అని కృష్ణా బోర్డు (KRMB) ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తుంది. మరి ఎవరికైనా అభ్యంతరం ఎందుకు ఉండాలి?
ఒక వైపు పంటలు ఎండిపోతాంటే నీళ్లు సముద్రం పాలు ఎందుకు అవ్వాలి? కృష్ణా నదికి ఏ మాత్రం సంబంధం లేని తమిళనాడుకు మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు 'పెద్ద మనసు'తో 5+5+5 (15)TMC ల నికర జలాలు ఇస్తున్నారే. ఈ నేల మీదుగా వెళ్తూ సముద్రంలో కలిసే నీళ్లు మీరు వాడుకోడానికి లేదంటున్నారే
కొంచెం 'పెద్ద మనసు' చేసుకోండి అన్నలూ. 'మనోభావాలు' కాదు 'మానవత్వం' తో చూడండి.

#RayalaseemaLiftIrrigation #RLI

చిత్రాలు : వికీపీడియా
You can follow @RayaIaseema.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: