ఓ వ్యక్తి దగ్గరకు ఒకామె వచ్చి సర్ నా భర్త చనిపోయాడు నాకు ఇద్దరు పిల్లలు ఇన్నిరోజులు నేను నాలుగిళ్ళల్లో పనిచేస్తూ నాజీవనం సాగించాను,ఇప్పుడు కరోనాకాలం కావడంతో నన్ను పనిమాన్పించారు
నాకు జీవనంపోయింది ఎలాగైనా నాకు ఒక కుట్టుమిషన్ ఇప్పించగలిగితే నేను నా జీవనంసాగిస్తానని చెప్పింది
అతను అదే విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా
ఓ వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది, వారు నిజంగానే సహాయం పొందడానికి అర్హులేనా అని అడిగారు అవునండి అని సమాధానం చెప్పడంతో సరే నేను కుట్టుమిషన్ తీసిస్తాను మీ నెంబర్ కు డబ్బులు పంపిస్తాను అని చెప్పాడు
వద్దు సర్ మీరు ఆ కుట్టుమిషన్ ఉన్న షాప్ యజమానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని అతని నెంబర్ ఇచ్చాడు

చిన్న ఆటో మాట్లాడుకుని వెళ్ళి కుట్టుమిషన్ తీసుకుని వారికి ఆ మిషన్కు సంబంధించి దారాలు సూది వగైరా ఇతర అవసరమైన వస్తువులతో..
పాటు నెలకు సరిపడే సరుకులు తీసుకుని వెళ్ళి ఆమె ఇంటి ముందు ఆగగా ఆమె ఆశ్చర్యపోయి కనీళ్ళు పెట్టుకుంది.

ఆమెకు సాయం చేసిన వ్యక్తిని చూపించడం కోసం వాట్సాప్ వీడియో కాల్ చేయగా అవతలి వ్యక్తిని చూస్తే ఆశ్చర్యం కల్గింది ట.
ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా బాగా సెటిల్ అయిన వ్యక్తి అయిఉంటాడని అనుకున్న అందరిలో ఆశ్చర్యం

అతను 25 ఏళ్ళ పిల్లాడు ఒక సైకిల్ పైన వీధి వీధి తిరుగుతూ టీ అమ్ముతున్నాడు అతని యజమాని ఎవరైనా సాయం చేస్తున్నారేమో అని సందేహం, కానీ ఎవరూ లేరు
అయితే అతడి గురించి ఆరా తీయాలనే ఆలోచన పెరిగింది

చిన్న తనంలోనే తల్లితండ్రిని పోగొట్టుకుని ఆకలి బాధను అనుభవించాడు పుట్టిన ఊరు వదిలి నా అనేవాళ్ళు లేకపోవడంతో
ఇలా కష్టపడి పనిచేస్తూ పైకి వచ్చాడు, నిత్యం అతను 20 మందికి పైగా వారి ఆకలి తీర్చే వాడుట, ఇతడి గురించి తెలుసుకున్న ఎంతోమంది అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించి
ఆ సహాయాలను నిజంగా అర్హులైన వారికే వారిచేతే ఇప్పిస్తుంటాడుట
అతడి ఆలోచనకు సలాం అతడి నిస్వార్థపు సేవకు నమస్కరిస్తున్న

కష్టం తెలిసినవాడు ఆ కష్టాన్ని తీర్చాలని ముందుకు వచ్చాడు నిజంగా నిజాయితీగా కష్టపడేవాళ్ళకు దేవుడు ఎప్పుడూ తోడు ఉంటాడు
సాయం చేసే మనసు ఉండలికాని ధనిక పేద చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🎊" title="Konfettiball" aria-label="Emoji: Konfettiball">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏🏻" title="Folded hands (heller Hautton)" aria-label="Emoji: Folded hands (heller Hautton)">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏🏻" title="Folded hands (heller Hautton)" aria-label="Emoji: Folded hands (heller Hautton)">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🎊" title="Konfettiball" aria-label="Emoji: Konfettiball">
You can follow @Ksravishankar2.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: