ఓ పదేళ్ల కుఱ్ఱాడు తన క్లాస్ పరీక్షకు ఫీజు కట్టేందుకు 3 రూపాయలు లేనందున ఒంగోలు నుంచి తన బావగారిని సాయమడుగుదాని పాతిక మైళ్ళు నడచి వెళ్ళాడు. కాని బావగారి దగ్గర డబ్బు లేకపోవడంతో అంతదూరం నడచుకుంటూ ఇంటికి తిరిగొచ్చి అలసటగా పడుకున్నాడు...
ఆ పిల్లాడి తల్లి పసివాడి పట్టుదలకు కదలిపోయి తన పెళ్ళినాటి పట్టుచీరను తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలను ఇచ్చి పరీక్ష రాయించింది. ఆ పిల్లవాడు ఆ తరువాత బార్ ఎట్ లా పాసయ్యి న్యాయవాదిగా ఆ రోజుల్లోనే లక్షలు సంపాదించి ఆపై గాంధీ గారి పిలుపుతో తన న్యాయవాద వృత్తిని
వదలిపెట్టి స్వాతంత్ర్య సమరంలో దూకి బ్రిటిష్ సిపాయి తుపాకికి గుండెనెదురొడ్డి స్వతంత్ర సేనానిగా నిలబడ్డాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా ,ముఖ్యమంత్రి గా ,ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తన సర్వస్వాన్ని ప్రజా అవసరాల కొరకు...
ఖర్చు పెట్టి వడదెబ్బతో చనిపోయాడు .
ఆ మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు..
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏🏼" title="Folded hands (mittelheller Hautton)" aria-label="Emoji: Folded hands (mittelheller Hautton)">
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏🏼" title="Folded hands (mittelheller Hautton)" aria-label="Emoji: Folded hands (mittelheller Hautton)">
ఆ మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు..