అందరికీ నమస్కారం 🙏

ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవండి.
ఇలాంటి విపత్కర సమయంలో చాలా మంది కోవిడ్ పెషంట్లు ప్లాస్మా దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మంది ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ముందుగా వారికి ప్లాస్మా డొనేట్ చేసేదానికి అవగాహన కావాలి. cont...
మన ఇంట్లో వాళ్ళకి ప్లాస్మా అవసరం అయితే గాని తెలవదు దాని విలువ. అపుడు సోషల్ మీడియాలో ర్జెంట్ గా ప్లాస్మా కావాలని పోస్టులు పెడుతుంటాం. ఇలా కాకుండా నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ప్లాస్మా ఇచ్చే వారి వివరాలు సేకరించాలి. అందుకు గాను ఒక ఫారం ఇచ్చి వారి వివరాలు ఇవ్వమని అడగాలి... contd...
పేరు, వయసు, రక్తం గ్రూప్, ఫోన్ నంబర్, డిశ్చార్జ్ అయిన తేదీ, వారి ప్రదేశం ఇలా వివరాలు సేకరించి, ఆ డేటాను ( http://www.janaswaram.com ) వెబ్సైట్ లో ఉంచాలి. ఎవరికైనా ప్లాస్మా అవసరం అనుకుంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి వారి వివరాలు చూసుకొని, వారిని ఫోను ద్వారా సంప్రదించవచ్చు. contd...
ఒకసారి శాంపిల్ గా చూడడానికి ఈ ఫారం ను నింపండి. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. https://forms.gle/8Jiifqr8o18JZjLT7
ఈ ఫారం నింపాక మీ వివరాలు మా దగ్గరకు చేరుతాయి. ఆ వివరాలను ప్రతిరోజూ వెబ్సైట్ లో పొందుపరుస్తాము. వెబ్సైట్ ప్లాస్మా చేయాలి అనుకునే వారి వివరాలు కింద ఉన్న ఇమేజ్ లో చూడవచ్చు contd...
అయితే కొన్ని సందేహాలు ఇలా మనం పబ్లిక్ గా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని వెబ్సైట్ లో పెట్టవచ్చా? అందుకు ముందు ముందు ఏమైనా సమస్యలు రావచ్చా? సమస్యలు రాకుండా ఏ వివరాలు సేకరించాలి ? ఏ వివరాలు సేకరించకూడదు ? వీటి గురించి తెలిస్తే చెప్పండి. ఈ పనిని మనం పబ్లిక్ గా చేయొచ్చా ? contd...
ఒకవేళ తీసుకున్నట్లయితే ఏ వివరాలు తీసుకోవాలో చెప్పండి. లేదంటే అన్నీ వివరాలు తీసుకొని వెబ్సైట్ లో పెట్టవచ్చా? నేను అయితే కొన్ని వివరాలు తీసుకునే దానికి చూశాను. ఒకసారి కింద చిత్రంలో చూడండి. ఇంకా ఏమైనా వివరాలు తీసుకోవాలా? ఇంకా ఏం వివరాలు తీసుకోవాలి ? contd...
అయితే మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా ? ఇంకా ఏమైనా మార్చడానికి, ఇంకా సేకరించడానికి, లేదా తొలగించడానికి ఏమైనా మార్గాలు చెప్పండి. నేను ఈ కార్యక్రమం చేయడానికి సరైనా మార్గమా? కాదా? మీరే నిర్ణయించాలి. అందరూ సహకరిస్తే ముందుకు తీసుకెళ్తాను. సహకారం లేకపోతే ఇక్కడితోనే ఆగిపోతుంది. జైహింద్
మీ అభిప్రాయాలు ఏమైనా తెలియజేయాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలపగలరు. ఈ విషయాన్ని మీ శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. వారు కూడా ఏమైనా విలువైన సమాచారాన్ని మనతో పంచుకోవచ్చు.
You can follow @naresh_writes.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: