"మన ప్రగతికి వైభవ ప్రతీక - మన నూతన సచివాలయం"

పాత సచివాలయంలో రీతి రివాజు లేకుండా కట్టిన భవనాలు. మంత్రులు ఒకచోట ఉంటారు. హెచ్‌వోడీలు మరోచోట. సెక్షన్‌ ఆఫీసులు ఇంకో చోట. ఒక ఫైలు కిందనుంచి పైదాకా రావడంకన్నా భూ ప్రదక్షిణం చేయడం సులువు
@KTRTRS

#TelanganaSecretariat 1/n
అవును, కొత్తది కడితే ప్రతిపక్షాలకి కోపం వస్తది, ఎందుకంటే అక్కడి నుండే కదా వాళ్ళు తెలంగాణాని అభివృద్ధి చేయకుండా కుంటు పడేట్లు చేసింది, నాటి దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం పాత సచివాలయం.
#TelanganaSecretariat
@KTRTRS
2/n
ఇప్పటికే చాలాసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. సాక్షాత్త్తు ముఖ్యమంత్రి ఉండే భవనం చుట్టే అగ్నిమాపక యంత్రం తిరిగే అవకాశం లేదు. మిగతా వాటి సంగతి దేవుడెరుగు. వేల మంది ఉద్యోగులు పనిచేసే చోట అగ్నిమాపక పరికరాలుండవు. ప్రమాదం జరిగినప్పుడు పారిపోదామంటే వీలు లేదు.
#TelanganaSecretariat 3/n
వేల మంది ఉద్యోగులు ఉండేచోట.. కనీసం వంద మంది సమావేశమయ్యే కాన్ఫరెన్స్‌ హాల్‌ లేదు. గెట్‌ టు గెదర్‌ పెట్టుకునే హాల్‌ లేదు. ఎప్పుడు ఎవరి మీద కూలుతాయో అన్నట్టుగా ఫైళ్ల గుట్టలు. ప్రభుత్వ సిబ్బందితో కనీసం వీడియో కాన్ఫరెన్స్‌ జరుపుకునే వీలులేదు.
#TelanganaSecretariat
@KTRTRS
4/n
కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా మనం ఇంకా వలస మరకలతోనే బతకాలా? కొత్త రాష్ట్రంగా కొత్త ప్రయాణాన్ని ఆరంభించిన #Telangana కొత్తగా ఉండాలని కోరుకోవడంలో, కొత్త సచివాలయాన్ని కట్టుకోవడంలో తప్పేమిటి? కోట్లాది ప్రజల గౌరవ సూచకంగా సచివాలయం ఎందుకు ఉండకూడదు?
#TelanganaSecretariat 5/n
మార్పును వ్యతిరేకించేవారు ఎప్పుడూ ఉంటారు. కానీ దార్శనికులు మాత్రమే ధైర్యంగా మార్పును ఆచరిస్తారు. ఆహ్వానిస్తారు. అందులో సీఎం కేసీఆర్‌ ఒకరు. తెలంగాణ ఎలా ఉండాలో కేసీఆర్‌కు ఒక కల ఉన్నది. ఒక కల్పన ఉన్నది. గొప్పగా చేసుకోవాలనే తపన ఉన్నది.
#TelanganaSecretariat 6/n
సచివాలయంలో ఇప్పుడున్న భవనాలు ఒక్కొక్కటి ఒక్కోసారి కట్టినవి. ఒకటి పాతదైందని కూల్చి కొత్తది కట్టేసరికి మరొకటి పాతదవుతుంది. ఈ అతుకుల బొంత సంసారం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఎన్నటికైనా కొత్త సచివాలయం కట్టుకోక తప్పదు
#TelanganaSecretariat 7/n
భవన నిర్మాణ నిబంధనలకు, రక్షణ సౌకర్యాలకు పాత సచివాలయ భవనాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వాటిని కూల్చి కొత్త భవనం కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమీ లేదని హైకోర్టు కూడా స్పష్టంచేసింది.
#TelanganaSecretariat 8/n
వలస పాలకులకు తెలంగాణ ఆత్మ తెలియదు. వారిలో తెలంగాణ హృదయం లేదు. వారు హైదరాబాద్‌ను మాది అనుకోలేదు. మమేకం కాలే దు. ఈ నేల మా తల్లి, మా జనని, మా ధరిత్రి, దీన్ని అందంగా అలంకరించుకోవాలనే సంకల్పం వారికి లేదు.
#TelanganaSecretariat
@KTRTRS
9/n
కేసీఆర్ గారి ఆలోచనేప్పుడు తెలంగాణ ప్రజల బాగు కొరకే! అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, తల్లిని కన్నతనయుడు మాన సీఎం సార్.
#TelanganaSecretariat
@KTRTRS
10/n
You can follow @rameshkotla.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: