స్వదేశీ.... విదేశీ.....

మా ఆవిడ పొద్దున పాల పాకెట్ కట్ చేస్తూ " ఇవి స్వదేశీ ఏనా?" అంది. నేను క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి "ఏమో చెప్పలేం, విదేశాల నుంచి పాల పౌడర్ వస్తోంది. దానిని కలిపి కంపెనీలు ప్యాకెట్ చేసి పంపుతున్నాయి. కాబట్టి అవి స్వదేశీనా,
విదేశీనా స్పష్టంగా చెప్పలేం" అన్నాను.

తర్వాత పాలు కాచి బూస్ట్ కలుపుతూ "ఇదేనా స్వదేశీనా?" అంది. "బూస్ట్ లో వాడే బార్లీ ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అవుతోంది అని విన్నాను" అన్నాను. ఒక నిట్టూర్పు విడిచింది.

ఆ తర్వాత టిఫిన్ చేయబోతూ "ఈ నూనె అయినా స్వదేశీ ఏనా?" "చెప్పలేం, పామాయిల్
మలేషియా నుంచి, పొద్దుతిరుగుడు ఉజ్బెకిస్తాన్ నుంచి, వేరుశనగ నూనె ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అవుతోంది" అన్నాను.

స్టవ్ వెలిగించి "ఈ గ్యాస్ అయినా స్వదేశీ నేనా...."
"అబ్బే.. అరేబియన్ దేశాల నుండి దిగుమతి అయిన పెట్రోలియం ప్రొడక్ట్స్ తో తయారయింది" అన్నాను.

స్టవ్ మీద పెనం పెడుతూ
"మరి దీని మాట" అంది.
"అది పిజియన్ కంపెనీ కదా! వాళ్ళు చైనాలో బల్క్ ఆర్డర్ ఇచ్చి తయారుచేయించి ఇక్కడ వాళ్ల లేబుల్ వేసుకొని మనకు అమ్మారు" అన్నాను. మళ్ళీ క్వశ్చన్ మార్క్.

ఫ్రిడ్జ్ తెరవబోతూ "మరి ఇదో...."
నా సమాధానం "ఎల్ జి కొరియా కంపెనీ కదా!"

వచ్చి సోఫా లో కూర్చోబోయి "మరి ఇది"
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🥶" title="Cold face" aria-label="Emoji: Cold face">
ఇది మలేషియాది అనుకు..." అన్నాను.

ఇక ఎదురుగా ఉన్న సోనీ టీవీ జపాన్ ది అని తనకు తెలుసు.

"మధ్యాహ్నం వంటలోకి టమాటా పప్పు చేస్తా" అంది.
"అది కంబోడియా నుంచి దిగుమతి అయిందేమో.." అన్నాను.

ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో అన్నం పెట్టబోతూ "పానాసోనిక్ జపాన్ ది కదా!" అంది. నిలువుగా తల ఊపాను.
అన్నం తినడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని "ఇదో" అన్నట్టు చూసింది. "షాపు వాడు ఇది చైనా ఇంపోర్టెడ్ అని చెప్పినట్లు ఉన్నాడే" అన్నాను.

బాత్రూం లోకి వెళ్తే షింకు, టాయిలెట్ సీట్, టాప్ లు.... మేం ఎక్కడినుంచి అన్నట్లు చూశాయి.

గోడమీది పోస్టరును చూసినా, గోడకేసిన రంగులు చూసినా, కింద
ఉన్న టైల్స్ చూసినా, చేతికున్న వాచీ, బట్టలు, ముఖానికి రాసుకునే పౌడర్, ఒంటి సబ్బు, తల నూనె......

. దేన్నీ చూసిన ఇప్పుడు ఒకటే అనుమానం. ఇది స్వదేశీ నా, విదేశీ నా... పిచ్చెక్కి పోతోంది. ఈ గ్లోబల్ యుగంలో ఏది స్వదేశీ నో, ఏది విదేశీ నో ఎట్ల రా నాయనా కనిపెట్టేది.

ఆరోగ్య సేతు యాప్ కరోనా
వ్యక్తులను కనిపెట్టినట్లు విదేశీ వస్తువులను కనిపెట్టే ఒక స్వదేశీ యాప్ వస్తే బాగుండు.

వచ్చినా ఏం చేస్తాం? అన్ని పడేసి స్వదేశీ కొందామన్నా డబ్బులు లేవు. అసలే సగం జీతాలాయే. అయినా 2021 జూన్ దాకా DA లేదని, ఇంక్రిమెంట్లు లేవు అని ఇప్పటికే వాతలేస్తిరి. అప్పోసప్పో చేసి కొందామంటే అసలు
ఈ వస్తువులన్నీ స్వదేశీ దొరుకుతాయా అనే పెద్ద డౌటనుమానం.

ఈ అనుమానాలతో పిచ్చెక్కి అర్ధరాత్రి అయినాక మంచం మీద పడుకుంటే & #39;ఈ పరుపు.... స్వదేశీ నేనా...?& #39;
మళ్ళీ అనుమానం.
" మూసుకొని పడుకోండి" అని మా ఆవిడ హెచ్చరిక.
You can follow @daitha12.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: