టీటీడీ భూములు అమ్మకాలు - విశ్లేషణ

1. గత రెండు రోజులుగా భారత దేశం లో ట్రెండ్ అవుతున్న విషయం టీటీడీ వారు ఏడూ కొండల స్వామికి కానుక గా ఇచ్చిన భూముల్ని అమ్మడానికి సిద్ధపడ్డారు అని. ఇందులో మనకి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి.. వీటి గురించి మనం విశ్లేషిద్దాం.
2. ఎప్పటి నుంచో జరిగే తంతు :

సుబ్బారెడ్డి గారు, ట్వీట్ పెట్టారు.. ఇది ఎప్పటి నుంచో జరిగే తంతు.. భూముల్ని ఎలా అమ్మాలో , విధి విధానాలు ఉన్నాయండి.. మేము ఏమి చెయ్యలేం . అదే కదండీ మా భక్తుల బాధ కూడా.. బోర్డులు మారిన స్వామి వారి భూములు అమ్మేస్తూనే ఉన్నారు. భక్తుల వేదన వినేదెవరు ?
3. ఎందుకు అమ్ముతున్నారు ?

మూడు కారణాలు మన ముందుకు వస్తాయి.

డబ్బులు కోసమా.
మేము మేనేజ్ చెయ్యలేం .
అన్యాక్రాంతం అవుతాయండి.
4. డబ్బులు కోసమా ?

ఫిక్స్డ్ డిపోసిట్స్ రూపంలో కొన్ని కోట్లు మూలుగుతున్నాయి టీటీడీ కి ...

డబ్బులు కోసం స్వామి వారికీ భక్తులు ఇచ్చిన భూములు అమ్మాల్సిన అవసరం లేదు.
5. మేము మేనేజ్ చెయ్యలేం .

ఏదో ఒక రోజు , గుడి కూడా మేము మేనేజ్ చెయ్యలేం అని అమ్మేస్తారా ? చెయ్యరు కదా , సరే కనీసం ఇలా మేనేజ్ చెయ్యడానికి కష్టంగా ఉన్నవాటిని అమ్మడం తప్ప వేరే రకంగా ఎలా డీల్ చెయ్యాలో ఆలోచించారా ? ప్రజలకు వివరించారా ?
6. అన్యాక్రాంతం అవుతాయి :

ఈ వాదన లో కొంత బరువు ఉంది, స్వామి వారికి ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. కానీ అన్యాక్రాంతం అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని పద్ధతులు నేను సూచిస్తా..
7. అన్యాక్రాంతం అవ్వకూడదు అంతే ఏమి చెయ్యాలి ?

టీటీడీ వారు ఈ భూములలో, ఇళ్లల్లో ఈ మూడు కార్యక్రమాలు చెయ్యచ్చు.

ధ్యాన మందిరాలు కట్టడం.
భజన మందిరాలు కట్టడం.
పితృ కార్యాలకు ఉపయోగ పడేలాగా చెయ్యడం.
8. ధ్యాన మందిరాలు + భజన మందిరాలు :

ఎక్కడ ఈ భూములు ఉన్నాయో, అక్కడ ధ్యాన మందిరాలు కట్టించండి. విష్ణు సహస్రనామది స్తోత్రాలు పారాయణ చేసేలాగా చుడండి. ఇలా 48 రోజులు పారాయణ చేసిన వారికి స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చెయ్యండి. కచ్చితంగా భక్తులు ముందుకు వస్తారు.
9. కట్టినాక ఎవరు చూసుకుంటారు :

మంచి కార్యం మొదలు పెడితే, దాని ముగింపు దేవుడే చూసుకుంటాడు. ఇన్ని ప్రదేశాలలో స్వామికి భూములు ఇచ్చారు అంటే అక్కడ స్వామి వారికీ భక్తులు ఉన్నట్టే కదండీ. వాళ్లే చూసుకుంటారు.
10. నెలకు 3000 ఇస్తే చాలు :

ధూప , దీపాలకు ఒక 3000 టీటీడీ వారు సర్దితే , అక్కడ స్థానిక భక్తులు చూసుకుంటారు.. స్వామి వారి భక్తులకి, ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల లోపల మందిరం తెరిచి, దీపం వెలిగించి ఒక గంట సేపు భజన చేసి వెళ్ళండి అంటే కచ్చితంగా ముందుకు వస్తారు .
11. పితృ కార్యాలకు వినియోగించడం :

ఎవరైనా చనిపోతే, నేటి పరిస్థితుల్లో తద్దినాలు పెట్టడానికి ప్రజలు కొంచం ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. పితృ కార్యం అంత గొప్పది. దీన్ని అంత్యేష్టి కార్యక్రమం అని కూడా అంటారు.

అంత్యేష్టి = అంత్య + ఇష్టి , జీవుడు వెళ్లిపోయే ముందు చేసే ఆఖరి కార్యం.
12. అసలు భక్తుడు ఎందుకు విరాళం ఇచ్చాడు ?

కొన్ని రోజుల తర్వాతా అమ్మేస్తారు అని తెలిస్తే అసలు ఆ భక్తుడు స్వామి వారికీ దానం కూడా ఇచ్చేవాడు కాదేమో..

ఇప్పుడు నేను ఒక చిన్న భూమి ఇవ్వాలి అనుకోండి , సరే ఎలాగూ అమ్మేసేదానికి భూమి ఎందుకు ఇవ్వడం.. డబ్బులే ఇస్తాడు కదా ??
13. స్వామి - భక్తుడు :

వెంకటేశ్వర స్వామి , తనని బాధ పెట్టినా ఏమి అనుకోడు కానీ , తన భక్తుడు బాధ పడితే మాత్రం ఒప్పుకోడు. దీనికి సంబంధించి ఎన్నో కథలు మన వాఙ్మయం లో ఉన్నాయి. ఒక తిరుమల నంబి కథ చెడవండి మీరు , మీకే తెలుస్తుంది.
14. టీటీడీ ముఖ్య కర్తవ్యం ఏమిటి ?

భక్తుల వసతులు , బాగోగులు చూసుకున్నాక , టీటీడీ చెయ్యాల్సిన పని ధర్మ ప్రచారం. దీనికి ఎంత సొమ్ము వెచ్చిస్తున్నారు టీటీడీ వారు ? రోడ్లు , కాలేజీలు , కట్టడానికా భక్తులు హుండీ లో డబ్బులు వేసేది. దానికి ప్రభుత్వాలు ఉన్నాయి.. ఇది మీకు ప్రాథమిక బాధ్యతా ?
15. రాజకీయ నాయకులూ - హైందవ మతానికి సమాన హక్కులు :

రాజకీయ నాయకులూ , హైందవ మతాన్ని తలపై పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ వేరే మతాలకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వకపోవడం మన దురదృష్టం. ఇదే పని అన్య మతాల ఆస్తుల గురించి చెయ్యగలరా ?
16. లోపించిన రాజకీయ విజ్ఞత -

మొత్తం వేలం వేస్తే ఎంత రావచ్చు - ఒక 10 కోట్లు, సరే 20 కోట్లు వస్తాయి అనుకుందాము.. ఇది ఒక ఎమ్యెల్యే ఒక ఎలక్షన్ కి పెట్టె ఖర్చు.

కానీ తెచ్చుకున్న చెడ్డపేరు ఎంత ?

రెండు రోజులు దేశం మొత్తం ట్రెండు , భక్తులలో ఆందోళన .
17. కార్యకర్తల అతి ఉత్సాహం :

ఇక కార్యకర్తలు అతి చెప్పనక్కర్లేదు,

ఇది వైసీపీ కోర్ ఎజెండా నా - కాదు

ఇందులో లాభం ఎక్కువ , నష్టం ఎక్కువ - నష్టమే ఎక్కువ .

మరి ఎందుకు అంతలా ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు , అవసరమే లేదు.
18. విజ్ఞప్తి :

@yvsubbareddymp గారికి ఇదే మా వినతి. ఇంతక ముందు ఇలాగె జరిగేది అని చెప్పడానికి కాదు ప్రజలు మిమ్మల్ని అక్కడ కుర్చోపెట్టింది.

భక్తుల ఆవేదన అర్థం చేస్కుని , ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని , ఆ భూములను హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగించాల్సిందిగా వినతి.

శుభం.
Glad to see the order rolling back the decision to sell Temple properties..
You can follow @_dinakar_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: