చెప్పే అంతటి వాడిని అవునో కాదో తెలియదు కానీ చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్న నా చిన్న ఆలోచన. ఇప్పుడు ఎలాగో కరోనా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయం లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలి అని Ysrcp అంటుంది కానీ గ్రామ స్థాయిలో అవి వాళ్ల పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. 1/n
ఇలాంటి సమయం లో ప్రతి గ్రామం లో ఒక JVC అంటే Janasena Village Committee అలాగే ప్రతి మండలంలో JMC Janasena Mandal Committee మరియు అలాగే JDC Janasena District Committee అని మనమే మన నియోజకవర్గ నాయకులకు చెప్పి పై కమిటీలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలు అందని ప్రజలకు సాయంగా ఉండాలి అని నా ఆలోచన.
ఈ మూడు కమిటీలు నియోజకవర్గ నాయకుల పరిధిలో ఉంటాయి. పథకాలకు అర్హులైన వాళ్ళకి అందరికీ జనసేన అండగా ఉంటుందని ప్రజలకు తెలుస్తుంది. ఈ విధంగా ప్రజల్లో కూడా మనకు ఉన్న ధైర్యం తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఒక బాగా పరిచయం ఉన్న వ్యక్తిని నియమించి గ్రామస్థులకు తెలిసేలా చేయాలి.
ఒకవేళ ఏ గ్రామ కమిటీ సభ్యులకైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మండల స్థాయి అలాగే మండల వాళ్ళకి జిల్లా స్థాయి వాళ్లు ముందుకు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పాలి అండగా ఉండాలి. పథకాలకు సంబంధించిన వివరాలు నేను, లేదా ఎవరో ఒకరు తెలియజేస్తూ ఉంటాము. ఈ విధంగా చేయగలిగితే జనసేన గ్రామ స్థాయిలో నిలుస్తుంది.