చంద్రబాబు @ncbn ప్రజా నాయకుడు అని ఎవరికైనా అనుమానం ఉందా ??

ఉంటే, ఒక 10 నిమిషాల సమయం కేటాయించి... ఇది చదవండి 🙏🙏🙏🙏

జన్మలో చంద్రబాబు భజన చేయరు 👍👍

చంద్రబాబు గురించి చెప్పాలంటే వందల వేల ట్వీట్లు కూడా సరిపోవు....
(చాలా వాటిని వదిలేయడం జరిగింది) 😔
1950 లో రెండు ఎకరాలు పొలం మాత్రమే ఉన్న పేద కుటుంబంలో జన్మించాడు చంద్రబాబు.

1972 లో BA డిగ్రీ పూర్తి చేసుకున్న చంద్రబాబు,

అప్పటికే కాలేజీలో గ్రూపు రాజకీయాలకి అలవాటు పడి, 1975 లో ఎమర్జెన్సీ సమయంలో అప్పటి యూత్ కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు సంజయ్ గాంధీ తో పరిచయం ఏర్పరుచుకున్నాడు.
సంజయ్ గాంధీ పరిచయం తో...
1978 లో తొలిసారి సొంత ఊరు చంద్రగిరి లో పోటీ చేసే అవకాశం దక్కింది...

ఇందిరా గాంధీ - కాంగ్రెస్ పార్టీ గాలిలో తొలి సారి ఎమ్మెల్యే అయ్యాడు చంద్రబాబు...

సంజయ్ గాంధీ సూచనల మేరకు, దేశమంతా 20% పదవులను పార్టీలోని యువత కే కేటాయించారు ఇందిరా గాంధీ....
ఆ 20% యువత లో అదృష్టవశాత్తూ, 28 సంవత్సరాల చంద్రబాబు కూడా ఉండడంతో....

టీ.అంజయ్య గారి మంత్రివర్గం లో చోటు దక్కింది....

ఎమ్మెల్యే అయిన మొదటి సారే సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా, సినిమాటోగ్రఫీ మంత్రి గా పని చేసే అవకాశం వచ్చింది....

తద్వారా సినిమా వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి..👍👍
1981 లో రామారావు గారి కుమార్తె భువనేశ్వరి ను వివాహం చేసుకోవడానికి... ఎన్.టి.ఆర్ కి రాయబారం పంపిన చంద్రబాబు సక్సెస్ అయ్యారు..
(ఇక్కడో స్టోరీ ఉంది భువనేశ్వరి గారి గురించి... కానీ అది నిజమో కాదో తెలీదు)

1981 సెప్టెంబర్ 10 న చంద్రబాబు - భువనేశ్వరి గార్లకి వివాహం అయింది...
ఆ సమయం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని ఎన్ టి ఆర్ నిర్ణయం తీసుకున్నారు...

అలా 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది...

ఎన్.టి.ఆర్ - హరికృష్ణ కలిసి... రాష్ట్రం మొత్తం పర్యటించి... ప్రజలలో ఆలోచనలు రేకెత్తించారు..
మొహానికి రంగులు వేసుకునే వాళ్ళకి ప్రజలు ఓట్లు వేయరు....

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, ఇందిరమ్మ ఆదేశిస్తే....

మామ ఎన్ టి ఆర్ మీద పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలికారు చంద్రబాబు..

సొంత ఊరు చంద్రగిరి లో టిడిపి అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఎమ్మెల్యే గా ఓడిపోయాడు చంద్రబాబు...
చంద్రగిరి లో మొత్తం 84 వేల ఓట్లు పొలయ్యితే 50 వేల ఓట్లు టిడిపి అభ్యర్థికి పడ్డాయి...

చంద్రబాబు 17,500 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు...

1983 జనవరి 9 న ఎన్ టి ఆర్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు...

ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రి అయిన 10 రోజుల్లోనే కాంగ్రెస్ కి రాజీనామా చేశాడు బాబు.
1983 జనవరి 25 న అధికారికంగా టిడిపి లో చేరాడు చంద్రబాబు..

చేరిన దగ్గర నుండి టిడిపి లో ఎలా నెగ్గుకు రావాలా అని... ఎత్తులు - పై ఎత్తులు వేసుకుంటూ....

అక్కడ మాటలు ఇక్కడ - ఇక్కడ మాటలు అక్కడా చెప్పుకుంటూ....

నాదెండ్ల భాస్కరరావు ని రెచ్చగొట్టి, టిడిపి లో ముసలం తీసుకొచ్చాడు..
1984 లో తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్యమంత్రి గా నాదెండ్ల భాస్కరరావు అవ్వడానికి కారణం చంద్రబాబు కుటిల రాజకీయాలే......

31 రోజులు ముఖ్యమంత్రి గా చేసిన నాదెండ్ల ను పదవీచ్యతుడు ని చేయడానికి కారణం కూడా చంద్రబాబే...

మొదటి విషయం తెలీని ఎన్.టి.ఆర్, రెండవ విషయంలో బాబు చేసిన కృషిని...
అభినందించి....

అప్పటివరకు పార్టీలో ఎలాంటి పదవీ లేని
చంద్రబాబు ని తెలుగుదేశం పార్టీ కి జనరల్ సెక్రటరీ చేశాడు ఎన్.టి.ఆర్..

ఆ తర్వాత చంద్రబాబు, మామ అండతో మరింత గా రెచ్చిపోయాడు....

దగ్గుపాటి వేంకటేశ్వర రావు & ఇతర కుటుంబ సభ్యులతో కలిసి, అనధికార అధికారాన్ని అనుభవించాడు చంద్రబాబు..
1985 లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది...

కానీ చంద్రబాబుకి కనీసం ఎమ్మెల్యే టిక్కెట్ కూడా దక్కలేదు...

ఈ అవమానాన్ని సహించలేని చంద్రబాబు....

ఎన్.టి.ఆర్ ని ఎలా అయినా దెబ్బ కొట్టాలని తలచాడు...

ప్రభుత్వంలో కొంత మంది ఎమ్మెల్యే లతో ఒక వర్గం ఏర్పాటు చేసుకున్నాడు.
1989 ఎన్నికలు నాటికి టిడిపి అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేశాడు చంద్రబాబు.

1988 లో వెలగపూడి రామకృష్ణ (ప్రస్తుత విశాఖ ఎమ్మెల్యే), కోడెల శివప్రసాద్ తదితరుల సహకారంతో, వంగవీటి రంగా హత్యకి ప్రణాళిక వేసి..

ప్రజల ముందు ఎన్.టి.ఆర్ ని దోషిగా నిలబెట్టి, బలిపశువును చేశాడు చంద్రబాబు
చంద్రబాబు కి 1985 లో దొరకని ఎమ్మెల్యే టిక్కెట్ 1989 లో దొరికింది...

సొంత ఊరు చంద్రగిరి వదిలేసి... కుప్పం లో పోటీ చేసి.. ముక్కీ మూలిగి.. 5 వేల ఓట్లు మెజారిటీ తో ఎమ్మెల్యే అయ్యాడు చంద్రబాబు...

(1989 లో చంద్రగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించింది గల్లా అరుణ)
ఒక వేళ చంద్రగిరి లో 1989 లో చంద్రబాబు పోటీ చేసి ఉంటే.. ఎమ్మెల్యే గా ఓడిపోయేవాడు...

ఆ తర్వాత 1994 లో ఎన్ టి ఆర్ గాలిలొ చంద్రగిరి నుండి... చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యే అయ్యాడు..

అప్పటి నుండి ఇప్పటి వరకు.. చంద్రబాబు సొంత ఊరు చంద్రగిరి లో టిడిపి విజయం సాధించలేదు🤣
1989 ఎన్నికల్లో ఘోర పరాజయం తో కృంగిపోయిన ఎన్.టి.ఆర్ కి లక్ష్మి పార్వతి రూపంలో తోడు దొరికింది...
(ఈ విషయాలన్నీ లక్ష్మీ స్ ఎన్ టి ఆర్ చిత్రం లో చూడవచ్చు..)

ఎన్.టీ.ఆర్. ను ఇబ్బంది పెట్టడానికి లక్ష్మీ పార్వతి రూపం లో మారో వజ్రాయుధం దొరికింది చంద్రబాబు కి...

ఈ అవకాశం వదులుకోలేదు....
లక్ష్మీ పార్వతి రాక తర్వాత,

ఎన్.టి.ఆర్ కి - కుటుంబ సభ్యులకి మధ్య మనస్పర్ధలు పెరగడానికి చంద్రబాబు చేసిన కృషి అనిర్వచనీయం.🤙

అలా అలా ఎన్.టి.ఆర్ మళ్లీ మునుపటి ఫాం లోకి వచ్చి... రాష్ట్రం మొత్తం పర్యటించి 1994 ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు...
(ఇది చంద్రబాబుకి ఊహించని దెబ్బ)
1995 ఆగస్టులో సీఎం హోదాలో ఎన్టీఆర్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు.

అదే సమయంలో హైదరాబాద్‌లో బాబు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు.

పార్టీలో, ప్రభుత్వంలో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా మారిందని, ఆమె వల్ల ప్రమాదం ఉందని చంద్రబాబు కుట్ర రాజకీయాలు కి తెర లేపాడు.....🤙🤙
మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు.. సచివాలయంలో తన కార్యాలయంలోనే పలువురితో మంతనాలు జరిపి క్యాంపు రాజకీయాలకు చేశారు.

అప్పట్లో ప్రముఖంగా ఉన్న ఈనాడు రామోజీ రావు చంద్రబాబు కి చేసిన సహాయం మరువలేనిది... రామోజీ ని మేనేజ్ చేసి తనకు అనుకూలంగా వార్తలు రాయించుకున్నాడు చంద్రబాబు..
20) చంద్రబాబుకు అనుకూలంగా 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మొదటి రోజు.... 140 మంది ఉన్నారంటూ రెండవ రోజు ఈనాడు పత్రికలో వార్తలు సర్క్యులేట్ చేయించి క్రమంగా బలం పెంచుకున్నాడు చంద్రబాబు..

దీంతో తాము ఎక్కడ వెనుకబడిపోతామో అనే భయంతో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చంద్రబాబు పంచన చేరారు...
21) చంద్ర బాబు క్యాంపు రాజకీయాల గురించి తెలుసుకున్న మిగతా ఎమ్మెల్యేలు...

జిల్లా పర్యటన నుంచి ఎన్టీఆర్ రాగానే ఆయణ్ని కలిసి పరిస్థితిని వివరించారు..

అయితే, పక్కా ప్రణాళికను అమలుపర్చిన చంద్రబాబు, ఆ తర్వాత వారిని కూడా తనవైపునకు తిప్పుకున్నాడు...
వెనుక ఏదో కుట్ర జరుగుతోందని భావించిన ఎన్టీఆర్....

లక్ష్మీపార్వతి, పరిటాల రవి తదితరులతో పాటు మరికొందరు నేతలను వెంటబెట్టుకుని ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్ వద్దకు చేరుకున్నారు.

ఎన్టీఆర్ వాహనం కనిపించగానే... లక్ష్మి పార్వతి మీద చెప్పులు వేయమని చెప్పాడు చంద్రబాబు..
ఘటన జరిగే నాటికి బాబుతో 50 - 60 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

అనుకూల మీడియాలో 140 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారని ప్రచారం చేస్తూ,
ఎమ్మెల్యేలపై బాబు ఒత్తిడి పెంచారు.

తన కుమారుడు హరికృష్ణ, పెద్ద అల్లుడు దగ్గుబాటి కూడా బాబు వెంట ఉన్నట్లు వార్తలు విని ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన చెందారు
NTR మీద చెప్పుల దాడి జరిగిన మరుసటి రోజే చంద్రబాబు తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌ వద్దకు ర్యాలీగా వెళ్లారు.

తమకే బలం ఉందని గవర్నర్‌కు లేఖ ఇచ్చారు.....

ఈ విషయం తెలుసుకున్న ఎన్ టి ఆర్.. చంద్రబాబు తో సహా ఐదుగురు నాయకులని టిడిపి నుండి సస్పెండ్ చేశాడు...
టిడిపి అధ్యక్షుడి హోదాలో ఉన్న ఎన్.టి.ఆర్... చంద్రబాబు తో సహా మరో నలుగురు నేతలపై 1995 ఆగస్టు 25న సస్పెన్షన్ వేటు వేశారు.

సస్పెన్షన్ వేటు పడినవారిలో అశోక గజపతి రాజు, విద్యాధర్ రావు, దేవేందర్ గౌడ్, ఎలిమినేటి మాధవ రెడ్డి ఉన్నారు.

సస్పెన్షన్ లేఖను స్పీకర్‌ యనమలకు పంపించారు ఎన్టీఆర్.
సీఎం కాకముందే చంద్రబాబు టీడీపీని కూడా చేతుల్లోకి తీసుకున్నారు.

పార్టీలో సర్వప్రతినిధుల సభ (మహానాడు) ఆమోదించి తీర్మానం చేస్తే తప్ప పార్టీ అధ్యక్షుడిని తొలగించడానికి వీల్లేదు.

కానీ, చంద్రబాబు తన వర్గీయులతో అప్పటికప్పుడు కాచిగూడలో బసంత్ టాకీస్‌లో మినీ మహానాడును ఏర్పాటు చేశాడు...
కాచిగూడలో బసంత్ టాకీస్‌లో మినీ మహానాడును ఏర్పాటు చేసి,

టిడిపి అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలగిస్తూ తీర్మానం చేయించి......

తనను అధ్యక్షుడిగా ఎంపిక చేయించుకున్నారు. 🏃🏃🏃

ఆ తర్వాత సెప్టెంబర్ 1న చంద్రబాబు ఏపీ సీఎంగా పదవి చేపట్టారు.😷😷😷
వెన్నుపోటు తో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఎన్ టి ఆర్....

ఒక వేళ నేను నిజం గా తప్పు చేసి ఉంటే, హరి కృష్ణ ను ముఖ్యమంత్రి గా చేయగలవా అని సవాల్ విసిరాడు ఎన్టీఆర్...

బాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ పరిస్థితి మరింత దయనీయం గా మారింది..
కుటుంబ సభ్యుల ఆదరణ కి నోచుకోని ఎన్టీఆర్ ....

కనీసం మంచి నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేకపోవడం తో... మంచాన పడ్డాడు ఎన్టీఆర్..

చంద్ర బాబు ముఖ్యమంత్రి అయిన 5 నెలల తర్వాత ఎన్టీఆర్ మరణించారు....

ఎన్టీఆర్ మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయాలకి, ఓట్లకు వాడుకున్నాడు ..
తన అనుకూల పత్రికల్లో ఎన్టీఆర్ ను లక్ష్మి పార్వతి చంపింది అనే వార్తలని సర్క్యులేట్ చేయించిన చంద్రబాబు.....

ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని కూరలో కరివేపాకు లా ఏరి పారేశాడు...

నా తర్వాత నా కొడుకు లోకేష్ పార్టీకి దిక్కుగా ఉండాలనే ఆలోచన 1995 నుండే బాబు మైండ్ లో ఉంది అనేది సృసృష్ఠం
ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన 2/- కిలో బియ్యం తీసేసి, 5.25/- చేశాడు.

మద్యపానం నిషేధం ఎత్తేసి, ఊరూరా బెల్ట్ షాపులు పెట్టాడు...

ఇలాంటి ఎన్నో వెధవ పనులు చేసి, 1999 ఎన్నికల నాటికి ఒక దగుల్భజి రాజకీయ నాయకుడు అయ్యాడు...

చంద్రబాబు అదృష్టం ఏమిటి అంటే.....
1995-2005 మధ్య ప్రపంచం యాంత్రికంగా గా పరుగులు పెట్టింది

ఈ కాలం లోనే టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి అధునాతన ఉపకరణాలు వచ్చాయి.

ఇవన్నీ కేవలం చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని కుల మీడియా హోరెత్తించి,

1999 ఎన్నికల నాటికి చంద్రబాబు ని సిద్దం చేశాయి....🙃🙃
1999 ఎన్నికల సమయంలో వాజపేయి నేతృత్వంలో పాకిస్థాన్ తో యుద్దం జరగడం...

చంద్రబాబు తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం....

ఓటుకి నోటు ఇచ్చి ఓట్లు కొనడం కూడా అప్పటినుండే మొదలు పెట్టిన బాబు సక్సెస్ అయ్యాడు...

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒంటరి గా పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదు...
2004 లో బీజేపీ తో...

2009 లో మహా కూటమి...

2014 లో జన సేన + బీజేపీ + టిడిపి కలిసి పోటీ చేసి 1% ఓట్లు తేడాతో అధికారం చేపట్టాడు చంద్రబాబు...

తర్వాత లోకేష్ ని బలవంతం గా ప్రజలపై రుద్దడం - జనం తిరస్కరించడం వంటివి వేగంగా జరిగాయి...

2019 లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు బొల్లి....
1987 లో చంద్రబాబు వల్ల భర్తరఫ్ అయిన అప్పటి టిడిపి మంత్రి, నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి కూడా బాబు గారి భవిష్యత్ చెప్పారు...

ముఖ్యమంత్రి పదవి కోసం సొంత మామ ఎన్టీఆర్ ని సైతం చంపడానికి వెనుకాడడు" అని చెప్పాడు...

ఆయన చెప్పిన 7 సంవత్సరాలకి ఆయన మాటలని నిజం చేసి చూపాడు @ncbn ..
2003 లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉండగా......

పరిటాల రవి చేసిన ప్రకటన ఇది...

చంద్రబాబు చేతి లో బలి అయిన... బలి కాబోతున్న వారి లిస్ట్ తయారు చేస్తే....

చదవడానికి మీకు - రాయడానికి నాకు ఓపిక ఉండదు ....👏👏👏👏
ఫైనల్ గా చెప్పేది ఏమిటి అంటే....

చంద్రబాబు అనే వాడికి ప్రజల్లో ఆదరణ లేదు...

సొంతంగా పార్టీ పెట్టీ, ఎమ్మెల్యే గా పోటీ చేస్తే, తన స్థానంలో కూడా గెలవలేని అసమర్థుడు చంద్రబాబు...

చంద్రబాబు బలం - మీడియా + న్యాయ వ్యవస్థ + మోసం + కుట్ర

ఇవి లేకపోతే @ncbn ఎప్పుడో జీరో అయ్యేవాడు 🤙🤙🤙
1994 డిసెంబర్ లో తెలుగుదేశం పార్టీ మీద ఆశలు వదిలేసుకున్న ఎన్టీఆర్ ... తనను మోసం చేసి, బాధ పెట్టిన వాళ్ళందరికీ బుద్ది చెప్పాలనుకున్నాడు...

రజనీకాంత్ & రాజ్ కుమార్ లతో కలిసి "భారతదేశం" పార్టీ పెడుతున్నా అని ప్రకటన చేశాడు....

కొత్త పార్టీ ప్రకటించిన నెలకే కన్ను మూశాడు.
వంగవీటి రంగా హత్య దగ్గర దెబ్బేసింది అన్నావు కదా @BeingKing_ ..
( https://twitter.com/BeingKing_/status/1263685410447749123?s=19)

రంగా హత్య విషయం లో చంద్రబాబు ప్రమేయం ఎక్కువగా ఉంది......

మీ అనుమానాలను నివృత్తి చేసే థ్రెడ్ 👍
దేవినేని మురళి హత్య కేసులో జైలులో ఉన్న రంగాని చూడడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు...

రంగా మీరు జైలులోనే ఉండండి , బయటకి వస్తే ఆ దేవినేని నెహ్రు మిమ్మల్ని చంపేస్తాడు అని అన్నారట.

'నెహ్రు వల్ల నాకేమీ కాదు, చంద్రబాబు, హోమ్ మంత్రి కోడెల నుంచి ప్రాణహాని ఉంది' అని రంగా చెప్పారు..
"రంగాను, నన్ను చంపాలని చంద్రబాబు చూసాడు. ఆ సమయంలో నేను తప్పించుకున్నాను"

అని నాటి కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మి నారాయణ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు..

NTR క్యాబినెట్ లో మంత్రిగా చేసిన, హరిరామ జోగయ్య కూడా రంగా హత్య గురించి బాబుకు ముందే తెలుసు అని తన పుస్తకం లో రాసారు.👍
బలమైన నాయకుడు రంగాను అప్పటి TDP ప్రభుత్వ సహకారం లేకుండానే నెహ్రు చంపించాడు అని చెప్పడం అసత్యం.

రంగా హత్యలో TDP పెద్ద నాయకుల పాత్ర ఉండబట్టే, రంగా హత్య జరగ్గానే కోస్తా అంతా అగ్ని గుండంలా మారింది.

కృష్ణ,గుంటూరు,గోదావరి జిల్లాల్లో ఉన్న కమ్మ వాళ్ళ మీద దాడులు ఎక్కువగా జరిగాయి !!!
వంగవీటి రాధ కూడా మా నాన్న హత్యలో కోడెల శివ ప్రసాద్, వెలగపూడి రామకృష్ణ ల ప్రధాన పాత్ర ఉంది అని చాలా సార్లు ఆరోపణలు చేశాడు....

నేడు తన స్వార్థ రాజకీయ అవసరాల కోసం.... చంద్రబాబు పక్షాన చేరి....

అప్పుడు ఏదో ఆవేశం లో చెప్పాను అని నాలుక మడతేసినా....... నిజం అబద్దం గా మారదు.....👍
వంగవీటి రంగా హత్య జరిగాక...

నా భర్తను చంపింది చంద్ర బాబు అని రంగా సతీమణి చెన్నుపాటి రత్న కుమారి హై కోర్ట్ లో కేసు వేశారు.👍

ఆ తర్వాత ఆమె టిడిపి లో చేరి, కేసు వెనక్కి తీసుకున్నారు......

వంగవీటి రాధాకృష్ణ కూడా టిడిపి లో చేరేలా వల పన్ని, రాధని బలి పశువును చేశాడు చంద్రబాబు...
చంద్ర బాబు కుట్ర రాజకీయాల గురించి... ఎన్టీఆర్ స్వయం గా విలేఖర్ల సమావేశం పెట్టి మరీ వివరించారు...

ఎన్టీఆర్ ధర్మ పీఠం 👍👍👍👍
You can follow @JagaNagAkhilFan.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: