✒✒✒✒✒✒✒✒✒✒✒
గౌరవ ప్రధాన మంత్రి గారికి విజ్ఞప్తి
***********************
విశ్లేషణ:
అశోక్ కుమార్
***********************
కరోనా వైరస్ వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.
చిన్న,మధ్య పరిశ్రమ లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అనేకమంది నిరుద్యోగులు అయ్యారు.
ప్రభుత్వానికి పన్నులు చెల్లించే మధ్య తరగతి ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వాలు ఎటువంటి సబ్సిడీలు, రేషన్ పై నిత్యావసర వస్తువులు అందవు. అన్ని త్యాగాలు చేసేది ఈ మధ్య తరగతి ప్రజలే.
ఈ మద్య తరగతి ప్రజలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటారు,అప్పు చేసి పిల్లలను చదివించు కుంటారు,అప్పు చేసి వాహనాలు,ఏ సి లు, ఫ్రిజ్ లు కొనుక్కుంటారు. అలా కొనుగోలు చేసిన వాటికి వడ్డీలు,పన్నులు చెల్లించు కుంటారు. వీరు వస్తువులు కొనుగోలు చేయక పోతే పరిశ్రమ లు నడవవు. ప్రభుత్వాలకు పన్నులు రావు.
వీరు విద్యుత్తు బిల్లులు ఎంత పెంచినా కిమ్మనకుండా కడతారు. వీరికి ఎటువంటి మినహాయింపులు ఉండవు.
వీరి జీవితాలను మెరుగు పరచడానికి ఏమి చేస్తారో చెప్పండి.మీరు ఈ మధ్య 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీ బీదలకు ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలకు అందులో ఏమీ భాగం ఉండదు.
ఐనా పేదల ఆకలి తీర్చి నందుకు సంతోషించాము.
ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే
మీరు ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ దయ చేసి రాష్ట్ర ప్రభుత్వాల కు పంచకండి .
ఎందుకంటే సంక్షేమ పథకాల మోజులో కొట్టుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు,బలహీన వర్గాలకు పప్పు బెల్లాల లాగా పంచేసి ఫోటోల కు ఫోజులు ఇవ్వగలరు.మీరు గతం లో ఇచ్చిన ధనం స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం రాష్ట్రంలో పంచిన సంగతి గమనించండి.
మధ్య తరగతి ప్రజలకు ఉచిత పథకాలు అక్కర్లేదు. విద్య,వైద్యం,ఉపాధి రంగాలు మెరుగు పడితే చాలు.
ఆంద్రప్రదేశ్ లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఉన్న బడ్జెట్ లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు
పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నా పనులు చేయించుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది
రామాయపట్నం పోర్టు,కోస్టల్ పరిశ్రమల కారిడార్ వంటివి కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి. త ద్వారా ఆంధ్రప్రదేశ్ లో విద్యావంతులైన యువతకు ఉపాధి కల్పించాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు పేదల కోసం అని వైసీపీ కారకర్తలకు పంచుకొంటూ పోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ, గతంలో సెజ్ ( SEZ) ల పేరుతో సేకరించిన భూములు కేంద్రం స్వాధీనం చేసుకుని పరిశ్రమలకు కేటాయించాలి.

రాష్ట్ర నిరుద్యోగులకు తక్కువ వడ్డీ కి రుణాలను బ్యాంకు ల ద్వారా కేటాయించి ఉపాది కల్పించాలి.
ఈ ప్రక్రియ లో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యం ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరించాలి.
రాజకీయ పార్టీల కార్యకర్తలకు కాకుండా నిజమైన విద్యావంతులకు వారి విద్యార్హత ప్రాతిపదిక పై లోన్ లు ఇవ్వాలి.

మధ్య తరగతి ప్రజల ఆత్మ గౌరవం కాపాడేలాగా ఆర్ధిక ప్యాకేజీ కేటాయింపులు ఉండాలి అని కోరుకుంటున్నాం.
You can follow @ashok4smile.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: