సాయంత్రం ఆడుకొని అప్పుడే ఇంటికి వచ్చిన 7-8 ఏళ్ల, నా మేనల్లుడు సిద్ధు గాడ్ని అక్క అడిగింది ఇంతవరకు ఆటలేంటిరా.. ఎంత టైం ఆడుకోమని చెప్పాను నేను? అని.

అబ్బా జస్ట్ 10 min యే ఎక్కువయింది కదా మమ్మీ కావాలంటే చూడు చిన్న ముళ్ళు 6 దగ్గరుంది పెద్ద ముళ్ళు 2 దగ్గర ఉంది అని సిద్ధు అంటూ ఉండగా..
నాకు మా బాస్ (from UK) నుంచి కాల్ వచ్చింది. ఈ టైంలో చేసింది ఏంటీ అనుకుంటూనే కాల్ రిసీవ్ చేసుకుంటే, జేమ్స్ రేపు కొత్త ప్రాజెక్ట్ గురించి టీం తో మీటింగ్ అనుకున్నాం కదా, at what time it is scheduled? అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలీక in fraction of seconds నాలో బోలెడన్ని ఆలోచనలు....
అంటే టీమ్ అంతా ఇండియాలో ఉన్నారు కాబట్టి ఈ టైం చెప్పాలా?

లేకపోతే ఆవిడ లండన్ లో ఉన్నారు కాబట్టి ఆ టైం చెప్పాలా?

ఏం చెప్తే ఆవిడ confuse అవుతారు, ఎలా చెప్తే confuse అవ్వరు అని ఒకదాని వెంట ఒకటి ఆలోచనలు. Impression పోతుందేమో అన్న భయం. ఈలోపు ఆవిడే it& #39;s ok send me mail with details..
అని ఫోన్ పెట్టేసరికి felt relaxed for a second.
.
.
ఇదొక్క విషయమే కాదు..
పొద్దున్న లేచాక నీళ్లు ఎలా తాగాలి ఎన్ని తాగాలి దగ్గర్నుంచి, తిరిగి పడుకునేటప్పుడు ఎడమవైపు పడుకోవాలా కుడివైపు పడుకోవాలా అని,
ఇలా అన్నీ ఆలోచనలే..!
అన్నీ ప్రశ్నలే .. అన్నీ అనుమానాలే..!
ఇంత చదువుకున్నాక, ఇంత వయసొచ్చాక, ఎంతోకొంత జ్ఞానం వచ్చాక కూడా ప్రతీ చిన్న విషయాలకి సంబంధించి అన్ని నిర్ణయాల్లోనూ సందిగ్ధమే, ఆలోచనలతో కూడిన అస్థిరత్వమే.

కానీ నాకు అర్ధం కాని విషయం ఏంటంటే నాకంటే 20ఏళ్ల చిన్నోడైన సిద్ధూ మాత్రం ఎంత అవసరమో అంతే ఆలోచిస్తూ ధైర్యంగా సమాధానం చెప్తున్నాడు
ఒకప్పుడు వాడి వయసులో నేను కూడా అలానే ఉండేవాడిని. దేనిగురించీ పెద్దగా తెలీకపోయినా,అప్పుడు నా పనుల్లో స్థిరత్వం, అనవసర అలోచనలే లేకపోవడం. కానీ ఇప్పుడు అన్నిట్లో అస్థిరత్వం.

అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది..

Man is going forward from cocksure Ignorance to Thoughtful Uncertainty.. అని
@Janasainikudu5 Sir adiagru ga... Present ilane thattindi. Nachakapote ignore cheyandi https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😁" title="Grinning face with smiling eyes" aria-label="Emoji: Grinning face with smiling eyes">
You can follow @JamesBonddd_007.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: