జలాంతర్గామి ( #Submarine) నీటిలో మునిగి ప్రయాణం చెయ్యగల వాహనం. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. ఈ రోజున 1900 సంవత్సరంలో అమెరికా నావికాదళం లోనికి ఐరిష్ శాస్త్రవేత్త జాన్ ఫిలిప్ హోలాండ్ నిర్మించిన మొదటి ఆధునిక జలాంతర్గామి ప్రవేశించింది.
#SubmarineDay
" ఘాజీ" ఈపేరు వినగానే భారత దేశ యుద్ధ చరిత్రలో ఒక అమోగ విజయం గుర్తుకు వస్తుంది, అసలు ఘాజి జలాంతర్గామి కథ ఏంటి !
భారత్ ఎందుకు దీన్ని మట్టుబెట్టింది.

ఘాజి దీన్నే PNS ఘాజి అంటారు,ఇదిఒక జలాంతర్గామి శత్రువుల కన్ను గప్పి సముద్ర భాగంలో యుద్ధం చేయడానికి ఉపయోగించే నౌక,
#Ghazi
PNS అంటే పాకిస్తాన్ నేవీషిప్ , ఈ పాకిస్తాన్ జలాంతర్గామిని విశాఖ సముద్రతీరానికి కాస్త దూరంలో భారత్ ద్వంసం చేసింది,ఇప్పటికి ఘాజి నౌక శిథిలాలు విశాఖ తీరాన సముద్రఅట్టడుగున ఉన్నాయి ,

అసలు ఘాజిని మన నేవీ ఎందుకు ధ్వంసం చేసింది ?
#Visakhapatnam
58 వేలకు పైగా ఇండియన్ నేవీ సిబ్బంది ఉన్న భారత్ నావీకా దళానికి గోప్ప చరిత్ర ఉంది , భారత రక్షణ వ్యవస్థలో ఒకటైన నావీకా దళం, ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగోవ నావీకా దళంగా ఉంది ,రక్షణతో పాటు పకృతి వైపరీత్యాల సమయంలో మానవతా సహాయాల్లోనూ ఇండియన్ నేవీ ఎంతో కీలక పాత్ర పోషించింది
#IndianNavy
1965 లో ఇండో ,పాక్ యుద్ధ సమయంలో భారత నావీకా దళం పూర్తిగా పోటీ చేయలేక పోయినా సముద్ర మార్గాన రక్షణ కవచంలా కీలక పాత్ర పోషించింది,1971వ సంవత్సరంలో జరిగిన భారత్ -పాక్ యుద్ధంలోవిశిష్టమైన పాత్రను పోషించింది, భారత్ ను ఎదురుగా
ఢీ కొట్టే ధైర్యం లేక దొంగ దెబ్బ తీయాలని కుట్రలు పన్నింది పాక్
అమెరికా నుంచి నాలుగేళ్ళు లీజుకు తీసుకున్న శక్తిమంతమైన జలాంతర్గామిని భారత్ పైకి ఉపయోగించెందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది,భారత్ కు చెందిన అతి పెద్ద INS విక్రాంత్ యుద్ధ నౌకను ధ్వంసం చేయాలని నిర్ణయించుకుంది, విక్రాంత్ ను ధ్వంసం చేసి భారత్ ను కోలుకో లేని దెబ్బ కొట్టాలని అనుకుంది.
ఇండో ,పాక్ వార్ సమయంలో భారత్ పై సముద్ర మార్గం ద్వారా దాడి చేసి భారీగా నష్టం చేకూర్చేలా ఈస్ట్ పాకిస్తాన్ లో కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు భారత్ కు ఇంటిల్ జెన్స్ రిపోర్ట్ వచ్చింది,ఈ కుట్రలో భాగంగా PNS ఘాజిని బరిలోకి దింపుతున్నారని తెలిసింది,అదే గనుక జరిగితే భారత్ నేవీకి భారీ
భారీ నష్టం తప్పదని గ్రహించిన నేవీ INS విక్రాంత్ ను సేవ్ జోన్ అయిన మద్రాసుకు పంపించింది, PNS ఘాజికి పాకిస్తాన్ దేశంలో అత్యాధునిక జలాంతర్గామిగా పేరుంది,ఘాజి కమాండోర్లు INS విక్రాంత్ కోసం వేట మొదలుపెట్టారు,మద్రాస్ పోర్టులో మెయింట్ నెన్స్ పూర్తి చేసుకున్న విక్రాంత్ తిరిగి
అక్టోబర్ 14 న విశాఖపట్నం
చేరుకుంది, పాకిస్తాన్ టార్గెట్ INS విక్రాంత్ మాత్రమే నని తెసుకున్న భారత్ నేవల్ కమాండోస్ బయటప్రపంచంతో సంబంధం లేకుండా INS విక్రాంత్ యుద్ధ నౌకను అండమాన్ ఐలాండ్ నికోబార్ కు పంపింది , కానీ పాకిస్తాన్ కు మాత్రం మద్రాస్ మరియు విశాఖ పోర్టుల మధ్య
విక్రాంత్ ఉన్నట్టు నమ్మించింది, భారత్ విశ్వ
ప్రయత్నాలు చేసి దాయాదిని నమ్మించింది, 14 నవంబర్ 1971 లో ఘాజీ ని బరిలోకి దించింది పాకిస్తాన్ ,విక్రాంత్ ను నాశనం చేయడమే లక్ష్యంగా 23 నవంబర్ న సముద్ర భాగంలో ఘాజీని మద్రాస్ కు చేర్చింది పాక్ , INS విక్రాంత్ మద్రాస్ నుంచి విశాఖపట్టణం వైపు
వస్తుందన్న నమ్మకంతో ఘాజీ మిస్సైల్స్ రెడీ చేసుకుంది, అదే సమయంలో భారత్ కు కొన్నిబలమైన సిగ్నల్స్ వచ్చాయి దీంతో ఘాజీ జలాంతర్గామి విశాఖ పోర్టుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉందని కనిపెట్టింది భారత నావీకాదళం, వెంటనే INS రాజపుత్ యుద్ద నౌకను రంగంలోకి దించింది భారత్ నేవీ
PNS ఘాజీని అయోమయంలో పెట్టెందుకు ఘాజీకి రష్యా భాషలో సిగ్నల్స్ పంపింది దీంతో ఘాజీ ఇది భారత నౌక కాదు అనే అపనమ్మకంతో దాన్ని టార్గెట్ చేయలేదు, ఆతర్వాత ఘాజీకి కొన్ని మైళ్ల దూరం వెళ్ళిబలమైన సిగ్నల్స్ ని పంపడం మొదలు పెట్టింది మన INS రాజపుత్ దీంతో ఘాజీ ఏదో పెద్ద షిప్ కొంత దూరంలో ఉందని
అది INS విక్రాంత్ అయింటుందని మిస్సైల్ వదిలింది ఈలోపు భారత నేవీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి PNS ఘాజీ సిగ్నల్స్ పంపుతున్న వైపు రెండు మిస్సైల్స్ ను వదిలింది,ఆ తర్వాత రాజ్ పుత్ కు ఘాజీ వైపు నుంచి ఎటువంటి సిగ్నల్స్ రాలేదు పైగా సముద్ర గర్భంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఘాజీ ధ్వంసమై
సముద్ర గర్భంలోకి చేరిందని భారత్ నేవీ అర్ధం చేసుకుంది డిసెంబర్ 4 ,1971లో ఘాజీ ధ్వసం అయ్యింది ఈ జలాంతర్గామీలో 92 మంది పాక్ నేవీ సిబ్బంది ఉన్నట్టు తెలిసింది,ఇది భారత్ నేవీ సాధించిన అద్భుతమైన విజయంగా చెప్పుకుంటారు.
జై భారత్ జై హింద్

ఘాజీ పేరుతో తెలుగులో సినిమా కూడా వచ్చింది
#Ghazi
You can follow @ParameswaraRaoH.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: