అచ్చ తెలుగు దీక్షా వాక్యము (Motto) - యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప

విద్యాలయాలకు, విశ్వవిద్యాలయాలకు, సంస్థలకు దీక్షా వాక్యాలు (Motto) ఉండటం పరిపాటి. ఆ దీక్షా వాక్యం ఆయా సంస్థలకు మార్గనిర్దేశనం చేసే ధర్మసూత్రం అవ్వొచ్చు,

#కడప #Kadapa #YVU #వేమన
వారు సమాజానికి, మానవాళికి ఫలానా సేవ చేస్తామనే ప్రతిజ్ఞ కావొచ్చు, లేదా ఆయా సంస్థల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే బిరుదు వాక్యం అయ్యుండొచ్చు. చాలా మట్టుకు సంస్థలు దీక్షావాక్యాన్ని సంస్కృతంలోనో, ఇంగ్లీషులోనో ఉంచుతాయి.
ఉదాహరణకు:

శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి - జ్ఞానం సంయగ వేక్షణం
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం - విద్యయా అమృత మశ్నుతే
రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు - విద్యయా విన్దతే అమృతం
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం - Knowledge is Power

మొదలగునవి.
కానీ తొలి తెలుగు శాసనం లభించిన కడప గడపలో , తొలి తెలుగు ప్రజాకవి వేమన పేరు మీద ఏర్పడిన విశ్వవిద్యాలయం తెలుగుకు పెద్దపీట వేసి తన దీక్షా వాక్యాన్ని తెలుగులో ఉంచింది.

వైవీయూ వారి దీక్షా వాక్యం - “తన్నుతానెరిగిన తానెపో బ్రహ్మంబు”
ఈ పాదం సామాజికవేత్త, ప్రజాకవి యోగి వేమన రచించిన పద్యంలోనిది.

పూర్తి పద్యం:

బ్రహ్మ మనగవేఱె పరదేశమున లేదు
బ్రహ్మ మనగ దానె బట్టబయలు
తన్నుదా నెఱిఁగినఁ దానెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

తనను తాను తెలుసుకోవడమే సర్వోత్కృష్ట జ్ఞానము / సత్యము / వేదము / విద్య అని దానర్థము.
యోగివేమన విశ్వవిద్యాలయంవారు విశ్వవిద్యాలయ పేరుకు సార్థకత చేకూరుస్తూ ఆ యోగివేమన చెప్పిన అచ్చ తెలుగు పద్య పాదాన్ని mottoగా నిర్ణయించడం ఎంతో గర్వకారణం.

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి దీక్షా వాక్యము కూడా అచ్చ తెలుగే - “దేశ భాషలందు తెలుగు లెస్స”
చిత్రాలు : వికీపీడియా
http://www.yogivemanauniversity.ac.in/ ">https://www.yogivemanauniversity.ac.in/">...
You can follow @RayaIaseema.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: