ఆంధ్రప్రదేశ మెడికల్‌ టెక్నాలజీ జోన్ (ఎఎంటిజెడ్‌) గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 2002లో హైదరాబాద్ ఫర్మా సిటీని ఎలా నెలకొల్పారో, ఇప్పుడు అది హైదరాబాద్ కు ఎలా ఆయువు పట్టు అయ్యిందో, అలాగే, విభజిత ఆంధ్రప్రదేశ్ కు కూడా, వైద్య రంగంలో చోటు కల్పించాలని,
దేశంలోనే తొలిసారి వైద్యపరికరాల తయారీ కేంద్రాన్ని వైజాగ్ లో ఏర్పాటు చెయ్యాలని చంద్రబాబు గారు, జూన్ 2016లో నిర్ణయం తీసుకుని, 2016 ఆగస్టు 19న, ఏపి మెడ్ టెక్ జోన్ కి, వైజాగ్ లోని, పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో శంకుస్థాపన చేసారు.
నిర్మాణం జరుగుతూ ఉండగానే, అనేక కంపెనీలు, ఇక్కడకు వచ్చాయి. 2016 ఆగస్టు 19న శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్, డిసెంబరు 12, 2018న ప్రారంభించారు. రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభం అయ్యాయి. రోబోనిక్‌ ఇండియా, ఫోరస్‌ హెల్త్‌, మాస్‌ మెడ్‌టెక్‌, గ్రీన్‌ ఓషన్‌
రీసెర్చ్‌ ల్యాబ్స్‌, ఫోనిక్స్‌ మెడికల్‌ సిస్టమ్స్‌, రెనాలిక్స్‌ హెల్త్‌ సిస్టమ్స్‌, బయోసైన్స్‌ టెక్నాలజీస్‌, జైనా మెడిటెక్‌ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ ప్రొడక్షన్ మొదలు పెట్టాయి. సూది నుంచి సీటీ స్కాన్‌ వరకు... వైద్యరంగానికి చెందిన అన్ని రకాల తయారీ ఇక్కడ జరుగుతుంది.
ఇక్కడ వరకు అంతా బాగానే సాగుతున్న సమయంలో, ఎన్నికలు రావటం, చంద్రబాబు ఓడిపోవటం, జగన్ రావటం జరిగిపోయాయి. సరిగ్గా ఇక్కడే ఏపి మెడ్ టెక్ జోన్ కు కష్టాలు మొదలయ్యాయి. చంద్రబాబుకి పేరు రాకూడదు అనో ఏమో, మెడ్ టెక్ జోన్ ని, నిర్వీర్యం చేసే ప్రయత్నం మొదలు పెట్టరు జగన్.
ఇక్కడ అవినీతి జరిగింది అంటూ గోల చేసారు. విజిలెన్స్ ఎంక్వయిరీ వేసారు. ఇది మెడ్ టెక్ జోన్ కాదు, ఇది ఒక మయసభ అంటూ, దీని పై విచారణకు ఆదేశించారు. ఈ మెడ్ టెక్ జోన్ కు అన్నీ తానై నడిపించిన, మ్యానేజింగ్ డైరెక్టర్ జితేందర్ శర్మను, జగన్ ప్రభుత్వం తొలగించింది.
తరువాత ప్రధాని మోడీ జోక్యంతో మళ్ళీ తీసుకున్నారు. ఇలా 10 నెలల్లో, ఏపి మెడ్ టెక్ జోన్ ని, నిర్వీర్యం చేసారు జగన్ మోహన్ రెడ్డి.ఇప్పుడు, కరోనా విజ్రుంబిస్తున్న వేళ, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా, మాస్కులు, పర్సనల్ ఎక్విప్మెంట్ సూట్ లు, వెంటిలేటర్లు, కొరత భారీగా ఉంది.
దీంతో, ఏ ప్రాజెక్ట్ అయితే, చంద్రబాబు మొదలు పెట్టారని పక్కన పెట్టారో, దేన్నీ అయితే మయసభ అన్నారో, ఇప్పుడు మళ్ళీ అదే ఏపి మెడ్ టెక్ జోన్, జగన్ ప్రభుత్వానికి కావాల్సి వచ్చింది.హుటాహుటిన, ఏపి మెడ్ టెక్ జోన్ లో, టెస్టింగ్ కిట్స్, మాస్కులు, వెంటిలేటర్లు తయారు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ రోజు భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి, పై మరొక ముందడుకు మన రాష్ట్రం నుంచే పడింది. నాడు చంద్రబాబు గారు వైజాగ్ మెడ్ టెక్ జోన్ లో, ప్రారంభించిన Molbio Diagnostics Pvt. Ltd, ఈ రోజు మెడ్ ఇన్ ఆంధ్రా, కరోనా టెస్ట్ కిట్లు తయారు చెయ్యటం మన రాష్ట్రానికి ఎంతో గర్వ కారణం.
ఇప్పుడ ఏపి మెడ్ టెక్ జోన్ మన రాష్ట్రానికే కాదు, దేశానికే, టెస్టింగ్ కిట్స్, మాస్కులు, వెంటిలేటర్లు అందించబోతుంది. అందుకే చంద్రబాబు గారు చెప్పింది, నేను శాశ్వతం కాదు, నిర్మాణం అవుతున్న ప్రతి ప్రాజెక్ట్ శాస్వతం, అది కాపాడుకోవాలి అని. ఇప్పటికైనా విజనరీకి ప్రిజనరీకి, తేడా.
You can follow @geni_genisa.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: