చంద్రబాబుకి వైజాగ్ మెడిటెక్ జోన్ కి సంభందం ఏమిటి? కరొనా కి, చంద్ర బాబు పెట్టిన మెడిటెక్ జోన్ కి రిలేషన్ ఏమిటి?

నిన్న జగన్ కరోనా టస్టింగ్ కిట్ ఆవిష్కరిస్తూ, కరోనా పాజిటివ్ లేక నెగటివ్ అని ఈ కిట్, మరియు టెస్టింగ్ మెషిన్ ద్వారా 50 నిముషాల్లో చెప్పగల మెషిన్ అని చెప్పారు. (1/18)
గోవా కు చెందిన Molbio Diagnostics Pvt. Ltd, అనే కంపెనీ ఈ మెషీన్లని, కిట్స్ ని వైజాగ్ దగ్గరలోని మెడిటెక్ జోన్లో వున్న తన కంపెనీ లో తయారు చేస్తోంది...

ఆంధ్రాలో ఇంత గొప్ప ఇండస్ట్రీలు ఉన్నాయా? ఎప్పుడు పెట్టారు?
(2/18)
నవ్య ఆంధ్రప్రదేశ్ కు వైద్య రంగంలో చోటు కల్పించాలని, దేశంలోనే తొలిసారి " వైద్య డయాజ్ఞస్టిక్స్" పరికరాల తయారీ కేంద్రాన్ని వైజాగ్ లో ఏర్పాటు చెయ్యాలని 2016 ఆగస్టు 19న, AP Meditech Zone కి, వైజాగ్ లోని, పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో శంకుస్థాపన చేసారు.(3/18)
- 2016 ఆగస్టు 19న శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్, డిసెంబరు 12, 2018న ప్రారంభించారు.

- రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ఈ మెడిటెక్ జోన్ లో తమ కంపెనీలను నెలకొల్పాయి.
(4/18)
రోబోనిక్‌ ఇండియా,
ఫోరస్‌ హెల్త్‌,
మాస్‌ మెడ్‌టెక్‌,
గ్రీన్‌ ఓషన్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌,
ఫోనిక్స్‌ మెడికల్‌ సిస్టమ్స్‌,
రెనాలిక్స్‌ హెల్త్‌ సిస్టమ్స్‌,
బయోసైన్స్‌ టెక్నాలజీస్‌,
జైనా మెడిటెక్‌
Etc ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ ప్రొడక్షన్ మొదలు పెట్టాయి.(5/18)
సూది నుంచి సీటీ స్కాన్‌ వరకు వైద్యరంగానికి చెందిన అన్ని రకాల తయారీ ఇక్కడ జరుగుతుంది.

సరే, మరి కరోనా కి అప్పుడే మెషిన్ తయారు చేసేసారా?
కాదు. Molbio Diagnostics, వారు తయారు చేసిన ఈ మెషిన్, అసలు TB వ్యాధి detection కోసం తయారు చేశారు. (6/18)
Sputem ఒక ట్యూబ్ లో పెట్టి ఈ మెషిన్ లో పెడితే 50 నిముషాల్లో TB ఉన్నదీ లేనిదీ చెప్పేస్తుంది. ఇలాంటి TB డిటెక్షన్ మెషీన్లని ఆంధ్ర రాష్ట్రం లోని 257 ప్రైమరీ హెల్త్ సెంటర్లు (PHC) ల్లో పెట్టారు.
(7/18)
కరోనా ఇప్పుడొచ్చింది. కానీ టీబీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పాలిట మహమ్మారి. రాష్ట్రాన్ని TB రహితంగా చేయాలనే ఉద్దేశ్యంతో, మెడిటెక్ జోన్ లోని ఆ కమోఎంఈ చేసిన మెషీన్లని రాష్ట్రం అంతతా నెలకొల్పారు. (8/18)
అంటే ఇప్పుడు ఆ 257 PHCల్లో కరోనా టెస్టింగ్ చెయ్యచ్చా?
నిరభ్యంతరంగా. కరోనా కోసం గొంతులోని Swab ని తీసుకొని మెషిన్ లో పెట్టటందుకు ఒక కిట్ అవసరం. ఆ కిట్ Molbio Diagnostics తయారు చేసింది. వారి దగ్గర నుంచి ప్రభుత్వం ఈ TB Detection Machine ఉన్న అన్నీ PHC లకు సరఫరా చేస్తే చాలు.(9/18)
ఇదొక్కటేనా మెడిటెక్ జోన్ లో తయారు అయ్యేది?
కాదు. వ్యాధి నిర్దారణకు అవసరమైన వివిధ వైద్య పరికరాలు, CT Scan ల నుంచి, టెస్ట్ ట్యూబ్ ల దాకా ఇక్కడ తయారు అవుతున్నాయి. కరోనా కు సంబంధించి చెప్పాల్సి వస్తే, మాస్కులు, PPE లు, వెంటిలేటర్లు, మొదలగునవి ఇక్కడ తయారు అవుతున్నాయి. (10/18)
ఇంత మంచి ప్రాజెక్టుని కొత్త జగన్ ప్రభుత్వం ప్రోత్సహించిందా?
- అధికారంలోకి రాగానే మెడ్ టెక్ జోన్ ని, నిర్వీర్యం చేసే ప్రయత్నం మొదలు పెట్టారు జగన్.

- అన్నీ విషయాల్లో చేసినట్లుగానే ఇక్కడ అవినీతి జరిగింది అంటూ గోల చేసారు.
(11/18)
- విజిలెన్స్ ఎంక్వయిరీ వేసారు. ఇది మెడ్ టెక్ జోన్ కాదు, ఇది ఒక మయసభ అంటూ, దీని పై విచారణకు ఆదేశించారు.

- ఈ మెడ్ టెక్ జోన్ ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన MD జితేందర్ శర్మను, జగన్ ప్రభుత్వం తొలగించింది. (12/18)
- దేశంలోని వైద్య రంగం లోని పలువురు ప్రముఖులు ఈ చర్యను నిరసించారు.
- ఇలా ఏపి మెడ్ టెక్ జోన్ ని, నిర్వీర్యం చేయ ప్రయత్నం చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు.

విజిలెన్స్ విచారణలో ఏమైనా బయట పడిందా?
జగన్ గారువేసిన వివిధ విచారణలు లాగానే, మెడిటెక్ లో ఏమీ జరగ లేదు అని తేల్చారు. (13/18)
మరి MD బదిలీ?
సాక్షాత్తూ ప్రధాన మంత్రి మోడీ గారు, వివిధ వైద్య సంఘాల నుంచి వచ్చిన విజ్ఞాపణలను చూసి, స్వతంత్ర విచారణ చేయించి, రాష్ట్రానికి అక్షింతలు వేస్తే, MD Jithender Sharma ను మళ్లీ MD గా ఆంధ్ర రాష్ట్రం నియమించింది. (14/18)
- కరోనా కట్టడి కోసం, ఒకప్పుడు అది మెడిటెక్ కాదు, మాయసభ అని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు మాస్కుల, వెంటిలేటర్లు, టెస్టింగ్ మెషీన్ల ఆర్దర్లు ఇస్తున్నారు.

- ఏపి మెడ్ టెక్ జోన్ మన రాష్ట్రానికే కాదు, దేశానికే, టెస్టింగ్ కిట్స్, మాస్కులు, వెంటిలేటర్లు అందించబోతుంది. (15/18)
చంద్రబాబు ఎన్నికల చివరి రోజున, ఒక మాట చెప్పారు.
- నేను శాశ్వతం కాదు
- ఈ రాష్ట్రం శాశ్వతం
- భవిషత్తు తరాల కలల రాజధాని అమరావతి శాశ్వతం
- నిర్మాణం అవుతున్న పోలవరం శాశ్వతం
- సీమలో పారే కృష్ణా నీళ్ళు శాశ్వతం
- మనం చేసిన గొప్ప పనులు శాశ్వతం
- అలోచించి మంచి నిర్ణయం తీసుకోండి.
(16/18)
అయితే మెజారిటీ ప్రజలు మాత్రం వేరే నిర్ణయం తీసుకున్నారు. నిజంగానే చంద్రబాబు చెప్పినట్టు మనుషులు శాశ్వతం కాదు. వారు చేసిన మంచి పనులే శాశ్వతం. అలాంటి మంచి పనుల్లో, చంద్ర బాబు హయంలో నిర్మించిన మెడిటెక్ జోన్ ఒకటి. (17/18)
ఈ రోజు కరోనా ఆపత్కర సమయంలో ఆ మెడిటెక్ జోన్ లిని కంపెనీల ఉత్పత్తులు మనల్ని ఆదుకొంటున్నాయి. (18/18)

#ThankYouCBNForMedTechZone
You can follow @saibollineni.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: