ప్రభుత్వ పాఠశాలల్లోతెలుగు మాధ్యమాన్ని పూర్తిగా నిలిపివేయడంపై చిన్నపాటి విశ్లేషణ...

ఇక్కడ విషయం విద్యకు మరియు మాతృభాషకు సంబంధించినది కావున కేవలం దానికి పరిమితమయ్యే ఆలోచనలు చేద్దాం..

గొలుసుకట్టు పెద్దగా ఉంది దయుంచి సహనంతో చదవగలరు..
మన స్వాతంత్ర్య అనంతరంవిద్య వ్యవస్దపై వేసిన మొట్టమొదటి కమిటీ విశ్వవిద్యాలయాల కమిటీ దీనినే రాధాకృష్ణ కమీషన్ (1948) అంటారు..
ఈ కమిషన్ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల్లోనూ మాతృభాషలోనే బోధన జరపాలనే సూచించి అమలుచేసి, మంచి ఫలితాలు రాబట్టింది.
తరువాత విద్యావ్యవస్థపై 1952 లో వచ్చిన మొదలియర్ కమిషన్ కూడా మాతృభాషలోనే బోధించాలని చెప్పింది

ఆతరువాత వచ్చిన అతి ముఖ్యమైన కమీషన్ కొఠారికమిషన్ 1964 నుంచి 1966 వరకు ఈ కమిషన్ అప్పటివరకు ఉన్న విద్యావ్యవస్థ విధానాన్ని పరిశీలించి విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయటానికి కేంద్రం నియమించింది
ఈ కమిషన్ కొన్ని విద్య లక్ష్యాలను పేర్కొంది, వాటిలో ముఖ్యంగా
1.విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి
2.సామాజిక, జాతీయ సమగ్రతను సాదించేదిగా ఉండాలి
3.ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి
4.విద్యను ఆధునీకరించాలి
పై లక్ష్యాలను సాధించడానికి కొన్ని సిఫారసులు చేసిందాకమిటీ అందులో బాగంగానే మాతృభాషలోనే బోధించాలి అలాగే త్రిభాషా సూత్రాన్ని అమలుచేయాలి, ఆంగ్లభాషప్రాధాన్యతను గ్రహించి ప్రాథమికస్థాయి నుంచే ఆంగ్లభాష అద్యనాన్ని ప్రోత్సహించాలి అని ఉన్నత విద్యలో అనుసంధాన భాషగా ఆంగ్లంఉండాలని తీర్మానించింది
మెరుగైన విద్యకోసం నూతన సూచనలు చేయవలసిందిగా ఆదేశించారు.
ఇది భాషపరంగా ఏ సూచనలు చేయకపోయినా ఆంగ్ల మధ్యమ పాఠ్యపుస్తకాలకై సిఫారసు చేసింది..

ఆతరువాత 86లో వచ్చిన జాతీయ విద్యావిధాన కమిషన్ కూడా మాతృభాషను బోధనాభాషగా సూచించింది..
కానీ అప్పటికే ఆంగ్ల మాధ్యమం కొంత ఊపిరి పోసుకొని ఒక దశకు చేరుకుంది. ఆతరువాత దశాబ్దంలో విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు ముఖ్యానంగా ప్రభుత్వేతర పాఠశాలలు కోకొల్లలుగా పుట్టుకొచ్చేసాయి...
ఈపాఠశాలలు 20వ శతాబ్దమంతా అటు సాంకేతికంగా, ఇటు సమాజికపరంగా ఆంగ్లనిదే అంటూ ప్రజలను మభ్యపెట్టి విద్యార్థులను ఆంగ్ల మాధ్యమంలో చేర్పించేవారు.. పోని ఉపాధ్యాయులుఏమైనా ఆంగ్లంలో దిట్టా అంటే వారికి తెలుగు కూడా సరిగా వచ్చేదికదు.. వల్ల వ్యాపారంకోసం ఇలా ఆంగ్ల మాధ్యమాన్నివాడుకొని విద్యార్థులకు
ఇటు మాతృభాషరాక, అటు ఆంగ్లము పూర్తిగా రాక అయోమయంలోకి తోసేసారు..
అలా ఎదిగిన పిల్లలే నేటి యువత తెలుగు సాహిత్యాన్ని చదవడం రాక తెలుగు పాటలు అర్థంకాక పాశ్చాత్యసంగీతాన్ని మాత్రమే వింటున్నారు.. వీళ్లలో ఎక్కువశాతం మందికి త్యాగయ్య తెలీదు జస్టిన్ బైబరు మాత్రమే తెలుసు,
అన్నమయ్య అంటే నాగార్జున అనే అనుకుంటారు.. మంచిని నేర్పించే చాటువులు, నీతిని బోధించే పద్యాలు, అవసరానికి ఉపయోగపడే సామెతలు వీరికివేమి తెలియవు.. పద్యం అంటే ట్వింకిల్ట్వింకిల్ లిటిలిష్టర్ లేదా జానీ జానీ యస్ పాపానే..
ఇలా అయితే మన భాష సంస్కృతి పూర్తిగా నాశనమైపోద్ది సరే, కానీ మన భావితరాలు మంచిని నేర్వకుండా ఎలా మనగలుగుతారు అని నావేదన, బంధాలు ఆత్మీయతలకు విలువలేకుండా తయారవుతారు.. ఆంగ్లభాషలో వ్యక్తిత్వ వికాస సాహిత్యం ఉన్నా కూడా అది మన మాతృభాషలో ఒక వేమన పద్యంతో సమానం..
కానీ అవి వారికి అర్థమవ్వాలంటే తెలుగు మాధ్యమం ఉండాల్సిందే..

అలాగని ఆంగ్లమాధ్యమం వద్దని నా అభిప్రాయం కాదు ఇప్పుడున్న ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చి బోధనకై సంసిద్ధులను చేయుటకు కనీసం 6 నెలలు సమయంపడుతుంది.. అలా చేయకుండా ఇప్పుడే ఆంగ్లమాధ్యమం మొదలుపెడితే విద్యార్థులు ఒత్తిడికిలోనై అటు
ఆంగ్లానికి ఇటు తెలుగుకీ నోచుకోకుండాపోతారు.. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచి విద్యార్థులకే ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తే బావుంటుంది...
అలాగే మన కవులు, రచయితలు, సాహితీవేత్తలు తలచుకుంటే సరికొత్త సాంకేతిక పదజాలంతో విజ్ఞాన శాస్త్రానికి, గణితానికి, భౌతిక శాస్త్రానికి,
అలా అన్ని శాస్త్రాలకు సరికొత్త పదజాలంతో ఒక నిఘంటువుని సంవత్సర కాల వ్యవధిలో అదించేయగలరని నాప్రగాఢ విశ్వాసం...
అప్పుడు మన భాషలోనే సమగ్రంగా విద్యను ఆర్జించేయగల సమర్థతమన భాషకు కలుగుతుంది.
మన భాషలో ఒక తియ్యదనం ఉంది అది మనం అనుభవిస్తున్నాం మరి మన తరువాతి తరాలకు అందజేయుట మనబాద్యత కాదా..
మనకున్న పద సంపద అమోఘం. అద్వితీయం.. అందమైన అజంతభాష మనది కాపాడుకుందాం..

శిశువు సౌందర్య దృష్టిని, ఆనందనుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృభాష ౼మహాత్మాగాంధీ

అమ్మపాలవంటిది మాతృభాష ౼ చావోస్కి
శైశవం మొదలుకుని జీవితాన్ని తీర్చిదిద్ధి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, జాతి అభివృద్ధికి, లోకోద్దరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది ౼బల్లార్ట్, రైబర్న్

"జనని సంసృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద
మెచ్చుటాడు బిడ్డమేలుగాదే"
౼శ్రీనాధుడు
"తెలుగుదేలయన్న, దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండ, తెలుగుగోకండ
యెల్లనృపులు గోలువనెఱుగవే బాసోడి
దేశభాషలందు తెలుగులెస్స"

౼ అందర్రాభోజ శ్రీకృష్ణదేవరాయలు వారు
తెలుగు తేనె తీపి తెలిసినవారికిన్
వెలుగు భాష నేడు విశ్వమునుకు
వెదకి చూడు పద్య విద్యావనంబునె
దొరుకు నీకు చక్రి తరిణి దారి

తెలుగు తేనియల రుచులు వెలుగు నేడు
సుమ పదములు పొంగెను సదా సుధల రీతి .
పలుకు తేనెల సొగసు పదము పలుకులు
పాడు కొనుమయ్య పద్యమున్ పరవశించి
తెలుగు అంటే భాష మాత్రమే కాదు మన సంసృతి, మన ఆత్మగౌరవం..
కాపాడుకుందాం..
తెలుగు ద్వారా ఆంగ్లాన్ని నేర్చుకుందాం..
తెలుగోడిగా గొంతేత్తుదాం.. మన ఉనికిని చాటుదాం...

తప్పులుంటే మన్నించండి..

-మీ తెలుగబ్బాయిhttps://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Person with folded hands" aria-label="Emoji: Person with folded hands">
You can follow @telugabbaini.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: