Work_is_worship

ప్రతిరోజు టాటా_మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు.

కానీ, కొన్ని రోజులనుండి సుమంత్_మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం
చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ” ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు" అనే అపవాదు వెయ్యటం సాగించారు.

ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
ఆయన కారుతో వెళ్ళి , రోడ్డు వెంబడి ”ధాబా" దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ, టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్ లు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ, టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ, ఆ విషయాలు తన నోట్బుక్ లో వ్రాసుకుంటూ, టాటా వాహనాల ఉత్పత్తి
నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయసేకరణ చేశాడు. అలా ఆ డైవర్లు చెప్పిన విషయాలతో టాటా వాహానాల నాణ్యతను పెంచి, వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకు వచ్చాడు శ్రీ సుమంత్ మోలగోంకర్.
ఆయన చేసిన సేవకు టాటా మోటార్సు ఆయన పేరున " టాటా_సుమో " వాహనానికి ఆయన పేరు పెట్టారు. సు అంటే సుమంత్, మో అంటె మోలగోంకర్.

ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది.. 👏👏👏
You can follow @daitha12.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.